Begin typing your search above and press return to search.
ఓటిటి విడుదలకు నోచుకున్న మరో యంగ్ హీరో సినిమా!
By: Tupaki Desk | 6 May 2020 5:00 PM ISTవిడుదలకు సిద్దమైన ఓ యంగ్ హీరో సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. అయితే ఎప్పుడో పట్టాలెక్కిన ఈ సినిమా విడుదల ఎందుకు కాలేదో తెలియదు. టాలీవుడ్ లో ప్రతీ ఏడాది ఎన్నో వందల సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే వాటిలో కొన్ని ఎప్పటికీ తెరమీదకు రావు. వీటిలో ఎక్కువగా అనామక సినిమాలే ఉంటాయి. కాస్త పేరున్న హీరో, దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ ఇలా ఎవరున్నా ఆ సినిమా ఎక్కువగా విడుదలయ్యేందుకు స్కోప్ ఉంటుంది. అయితే 2013లో తెరకెక్కిన ఒక యువ హీరో సినిమా ఏడేళ్లు కావొస్తున్నా ఇంకా వెలుగు చూడలేదు. ఆ సినిమాపై ఆ హీరో కూడా ఆశలు వదిలేసుకున్నాడు. ఆ చిత్రమే డీకే బోస్. ఆ సినిమాలో హీరో సందీప్ కిషన్. గతేడాది నిను వీడని నీడను నేనే చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్ ను అందుకున్న సందీప్ కిషన్ మళ్ళీ తెనాలి రామకృష్ణ అనే నాసిరకమైన సినిమా చేసి పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
సందీప్ కి ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ అందుకోలేక పోయాడు. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న ఏ1 ఎక్స్ ప్రెస్ అనే చిత్రంపై చాలా నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే 2013లో తెరకెక్కి విడుదల కాకుండా ఆగిపోయిన డీకే బోస్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేంటి ఇప్పుడు థియేటర్లు లేవు కదా.. ఎలా విడుదలవుతోంది అనుకుంటున్నారా.. ఇప్పుడు ఆ సినిమా విడుదల అయ్యేది ఓటిటి ప్లాట్ ఫామ్ లో. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూసి విడుదలవ్వక ఆగిపోయిన డీకే బోస్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ త్వరలో విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అది ఎప్పుడు, ఏ ఓటిటిలో విడుదలవుతుంది అనేది ఇంకా తెలియలేదు.. కాస్త వెయిట్ చేయాల్సిందే!