Begin typing your search above and press return to search.

ఖైదీ-2` స్క్రిప్టు రెడీ అవుతోందా?

By:  Tupaki Desk   |   26 Oct 2019 5:30 PM GMT
ఖైదీ-2` స్క్రిప్టు రెడీ అవుతోందా?
X
త‌మిళ హీరో కార్తీ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఖైదీ ఈ శుక్ర‌వారం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. తెలుగు స‌హా త‌మిళ్ లోనూ బ్లాక్ బ‌స్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. విమ‌ర్శ‌కులు సైతం గొప్పగా మెచ్చిన చిత్ర‌మిది. దీంతో కార్తీ కెరీర్ కి మ‌రో కంబ్యాక్ సినిమాగా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. నేటివిటీ క‌థ‌కు త‌గ్గ‌ట్టే.. దిల్లీ పాత్ర‌లో కార్తి ఒదిగిపోయిన వైనం అద్భుతం. ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ప్ర‌తి స‌న్నివేశంలో కొత్త‌ద‌నాన్ని చూపించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అవ‌స‌రం లేని కామెడీ.. అతికిన‌ట్టు ఉండే పాట‌లు లేకుండానే విభిన్నమైన‌ క‌థ‌తో భారీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఖాకీ త‌ర్వాత ఖైదీ రూపంలో ఖాకీని మించిన గొప్ప స‌క్సెస్ ఇది. ప్ర‌స్తుతం కార్తీ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే సీక్వెల్ గా ఖైదీ-2 వ‌స్తుందా? అంటే ఛాన్సుంద‌నే తెలుస్తోంది. రిలీజ్ అనంత‌రం ఖైదీ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ కు సీక్వెల్ ఉండ‌బోతుందా? అంటూ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు.. కార్తీ అభిమానులు మెసేజ్ లు పంపుతున్నారట‌. ఈ సంద‌ర్భంగా లోకేష్ క‌న‌క‌రాజ్ సీక్వెల్ పై స్పందించ‌డం విశేషం.

ఖైదీ ని ఇంత‌ పెద్ద హిట్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. ఖైదీని తెర‌కెక్కించిన ప్ర‌తీ క్ష‌ణం నాకు ఎంతో ఇష్టం. జీవితంలో ఎప్ప‌టికీ గుర్తుండిపోయో మెమ‌రీస్ అవి. సీక్వెల్ పై ఒక‌టే మెసేజ్ లు.. ఫోన్ లు వాట‌న్నింటికి ఒక‌టే స‌మాధానం. మిమ్మ‌ల్ని అంద‌ర్నీ మెప్పించ‌డానికి దిల్లీ మ‌ళ్లీ వ‌స్తున్నాడు. వెయిట్ అండ్‌ సీ అంటూ క‌న్ క్లూజ‌న్ ఇచ్చాడు. దీంతో ఖైదీ 2కి క‌థ రెడీ చేసేందుకు ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ రెడీ అవుతున్నార‌ని అర్థ‌మైంది.