Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ జాబితాలో మరో దర్శకుడు చేరాడు

By:  Tupaki Desk   |   2 Jan 2021 2:30 PM GMT
ఎన్టీఆర్‌ జాబితాలో మరో దర్శకుడు చేరాడు
X
ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఎన్టీఆర్‌ మార్చి లేదా ఏప్రిల్‌ నుండి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. ఈయన తదుపరి చేయబోతున్న సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఇప్పటికే అరడజనుకు పైగా దర్శకులు ఈయనతో సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు అట్లీ నుండి మొదలుకుని పలువురు తెలుగు దర్శకులు ఇంకా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ వరకు ఎన్టీఆర్‌ తో సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వాటిలో ఏది అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పుడు ఎన్టీఆర్‌ జాబితాలో మరో దర్శకుడు వచ్చి చేరాడు. కార్తీ హీరోగా తమిళంలో ఖైదీ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ప్రస్తుతం విజయ్‌ హీరోగా 'మాస్టర్‌' సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ తో ఒక సినిమాను చేసే పనిలో లోకేష్‌ కనగరాజ్ ఉన్నాడు. ఈయన ఇటీవల ఎన్టీఆర్ తో సినిమా విషయమై చర్చించాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలు అయినా నిజం అయితే బాగుండు అని ఎన్టీఆర్‌ అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా విషయంలో స్పష్టత ఎప్పటికి వస్తుందో అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ తో ఎన్టీఆర్‌ మూవీ నిజమే అయితే అభిమానులకు పండుగే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.