Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' కోసం కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   6 Nov 2021 3:30 PM GMT
భీమ్లా నాయక్ కోసం కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేస్తున్నారా..?
X
పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నవంబర్ నెలాఖరుకి చిత్రీకరణ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. ప్రమోషనల్ కంటెంట్ లో కూడా ఇదే డేట్ ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే చెప్పిన సమయానికి పవన్ సినిమా రాకపోవచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

RRR విడుదల తేదీ ఖరారు చేయడంతో సంక్రాంతి సినిమాల జాబితాలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 'రాధే శ్యామ్' జనవరి 14వ తేదీనే రావాలని ఫిక్స్ అవ్వగా.. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. 'భీమ్లా నాయక్' సినిమా కూడా ప్లాన్ చేసిన ప్రకారం విడుదల కాదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ సినిమా కోసం రెండు కొత్త విడుదల తేదీలను మేకర్స్ పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది.

'భీమ్లా నాయక్' చిత్రాన్ని 2022 జనవరి 26 రిపబ్లిక్ డే వీకెండ్ లో లేదా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ మీద మేకర్స్ మరోసారి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇది మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి రీమేక్‌. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. పవన్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సతీమణిగా సంయుక్త మీనన్ నటిస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ 'భీమ్లా నాయక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.