Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లో అందరూ మహా శిల్పి జక్కన్నలే!
By: Tupaki Desk | 11 May 2020 7:00 PM ISTసాధారణంగా స్క్రిప్ట్ డెవలప్మెంట్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ సమయంలో తప్ప అధికశాతం సందర్భాలలో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు పెట్టుకోరు. ఒకసారి షూటింగ్ ప్రారంభం అయ్యాక ఎక్కువమంది ఫిలిం మేకర్లు స్క్రిప్ట్ కు తగ్గట్టుగా పని చేసుకుంటూ పోతారు. ఆన్ ది స్పాట్ ఏవైనా ఇంప్రూవైజేషన్స్ ఉంటే జరుగుతాయి గాని అవి జస్ట్ డైలాగుల వరకే పరిమితం అవుతాయి. అరుదైన సందర్భాలలో మాత్రమే స్క్రిప్ట్ తిరిగి రాయడం లాంటి చేస్తారు. ఎందుకంటే స్క్రిప్ట్ తిరిగి రాయడం.. సీన్స్ మార్చడం లాంటివి చేస్తే షూటింగ్ షెడ్యూల్స్ అటు ఇటు అవుతాయి.. నటీనటుల కాల్షీట్స్ లాంటి వాటితో ఇబ్బంది కూడా ఎదురవుతుంది. అందుకే వీటి జోలికి పోరు.
అయితే లాక్ డౌన్ కారణంగా ఫిలిం మేకర్లందరికీ ఇప్పుడు చాలా సమయం దొరికింది. షూటింగులు అర్థంతరంగా నిలిచిపోవడంతో దర్శకులకు తమ స్క్రిప్ట్ లను మెరుగులు దిద్దుకునే అవకాశం లభించింది. దీంతో దాదాపుగా అందరూ దర్శకులు తన చేతిలో ఉన్న స్క్రిప్టులను మరింత పకడ్బందీగా తయారు చేయడంలో బిజీగా ఉన్నారట. కొంతమంది దర్శకులు అయితే ఇప్పటికే షూటింగ్ లో ఉన్న సినిమాల లో కొన్ని సీన్లను మార్చి రాస్తున్నారట.
కొరటాల శివ ఇప్పటికే 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కు సంబంధించిన సీన్లను.. డైలాగ్స్ ను మార్చి రాశారట. సుకుమార్ 'పుష్ప' చిత్రం స్క్రిప్టుకు మరింతగా మెరుగులు దిద్దుతున్నారట. RRR షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో రాజమౌళి పెండింగ్ ఉన్న సీన్స్ కు మరింత బెటర్ గా చేసేందుకు కృషి చేస్తున్నారట. అందులో ఆలియాభట్ సీన్స్ ఉన్నాయని సమాచారం. స్టార్ డైరెక్టర్లు మాత్రమే కాకుండా ఇతర దర్శకులు కూడా తమ స్క్రిప్టులను మరింత పకడ్బందీగా తయారు చేసుకుంటున్నారని ఒకరకంగా ఇది ఇది వారికి ప్లస్ పాయింటేనని అంటున్నారు. ఈ లాక్ డౌన్ దర్శకులు అందరినీ మహా శిల్పి జక్కన్నలుగా మార్చిందని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.