Begin typing your search above and press return to search.
#BB3 నుండి సునీల్ ఔట్
By: Tupaki Desk | 12 Jun 2020 11:00 AM ISTగత మూడు నెలలుగా షూటింగ్స్ లేక పోవడంతో అప్పటికే ప్రారంభం అయిన సినిమాలు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు ఇంకా మొదలు కాని సినిమాలు మరింత టైంను స్క్రిప్ట్ మేకింగ్ కోసం కేటాయించారు. మొత్తానికి ఈ ఫ్రీ టైంను దర్శకులు రచయితలు పూర్తిగా వినియోగించుకుని కొత్త స్క్రిప్ట్ లను రెడీ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే బాలకృష్ణ తో సినిమాను ప్రారంభించారు. దాదాపుగా 40 శాతం షూటింగ్ కూడా పూర్తి అయ్యిందట.
షూటింగ్ కు గత మూడు నెలలుగా బ్రేక్ పడటంతో దర్శకుడు బోయపాటి మళ్లీ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడట. ఆ మార్పులు చేర్పుల్లో భాగంగా సినిమాలోని కామెడీ ట్రాక్ ను పూర్తిగా తొలగించాడట. దాంతో సునీల్ ను ఈ సినిమాలో నటింపజేయాలనుకుని మళ్లీ క్యాన్సల్ చేశారు. బాలకృష్ణ బోయపాటి సినిమా కోసం ఎదురు చూస్తున్న సునీల్ కు ఇది చేదు వార్త అని చెప్పక తప్పదు.
హీరోగా సక్సెస్ లు లేకపోవడంతో కమెడియన్ గా మళ్లీ బిజీ అవ్వాలనుకున్న సునీల్ కు బోయపాటి షాక్ ఇచ్చాడు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందబోతున్న చిత్రంలో సునీల్ కు మంచి పాత్ర ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. సునీల్ కమెడియన్ గా పలు చిత్రాల్లో ఛాన్స్ లు వస్తున్నా కూడా కాస్త గుర్తింపు తెచ్చే పాత్రను చేయాలని భావిస్తున్నాడట. బోయపాటి మంచి పాత్ర ఇచ్చినట్లే ఇచ్చి హ్యాండ్ ఇవ్వడంతో సునీల్ ఒకింత నిరుత్సాహ పడ్డాడట.