Begin typing your search above and press return to search.

లోఫర్ కి సర్టిఫికెట్ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   9 Dec 2015 4:18 PM GMT
లోఫర్ కి సర్టిఫికెట్ ఇచ్చేశారు
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - ముంబై భామ దిశా పటాని తో పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిపోయాయి. ఈ నెల 17న రిలీజ్ కానున్న లోఫర్ మూవీ.. ఇప్పుడు విడుదలకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సిద్ధమైపోయింది.

డిసెంబర్ 9న సెన్సార్ కి పంపినా.. లోఫర్ కి సంబంధించిన ఫస్ట్ కాపీ కొన్ని వారాల క్రితమే రెడీ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు రిలీజ్ దగ్గరకు రావడంతో., చివరి నిమిషంలో హడావిడి లేకుండా ఉండేందుకు.. వారం ముందే సెన్సార్ చేయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 మధ్యాహ్నం స్పెషల్ స్క్రీనింగ్ చూసిన సెన్సార్ సభ్యులు.. కొన్ని కట్స్ చెప్పడంతోపాటు, మరికొన్ని చోట్ల డైలాగ్స్ ను మ్యూట్ చేయాల్సిందిగా చెప్పారు. మొత్తం మీద సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బృందం.

సెన్సార్ టాక్ ప్రకారం ఫస్టాఫ్ అంతా పూర్తి కామెడీ, యాక్షన్ తో నింపేసిన పూరీ.. సెకండాంఫ్ లో మాత్రం ఫుల్లు సెంటిమెంట్ పండించేసినట్లు తెలుస్తోంది. మరోవైపు దిశా పాట్నీ అందాలు కూడా స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. ఫైటింగుల్లో హింస ఎక్కువగా ఉండడంతోనే యూ/ఏ సర్టిఫికేట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఇచ్చిన లోఫర్ మూవీకి.. నిర్మాత సి.కళ్యాణ్.