Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న ఎన్టీఆర్ టీమ్...!

By:  Tupaki Desk   |   19 May 2020 2:20 PM GMT
ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న ఎన్టీఆర్ టీమ్...!
X
హీరోల పుట్టిన రోజు వచ్చిందంటే వారి అభిమానులు చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద కటౌట్లు.. బ్యానర్లు.. ప్లెక్సీలు.. కేక్ కటింగులు అంటూ హడావిడి చేస్తూ ఉంటారు. తమ ఫేవరెట్ హీరో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని ఫ్యాన్స్ కటౌట్లు ముందు బర్త్ డే వేడుకలు జరుపుతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేటెస్టుగా తమ ఫేవరేట్ హీరోల ఫోటోలను అందరూ కామన్ డీపీలుగా పెట్టుకొని బర్త్ డేని సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 20న అనగా రేపు నందమూరి తారక రాముడి పుట్టినరోజు. తారక రాముడి అభిమానులకు పండగ రోజు. దీని కోసం పది రోజుల ముందే తారక్ డై హార్డ్ ఫ్యాన్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు. కామన్ డీపీని 25 మంది టాలీవుడ్ ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేపించి హంగామా చేసారు.

ఇక ఎన్టీఆర్ బర్త్ డే నాడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా నుంచి 'కొమరం భీమ్' ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియో వస్తుందని.. సంబరాలు అంబరాన్ని అంటేలా చేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ 'కొమురం భీమ్' పాత్ర‌లో తార‌క్ ఎలా ఉంటాడో చూడాల‌నుకున్న ఆయ‌న ఫ్యాన్స్‌ కు నిరాశ ఎదురైంది. 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర యూనిట్ ఎలాంటి టీజ‌ర్‌ ను విడుద‌ల చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ సైతం పుట్టినరోజు సందర్భంగా 'ఆర్.ఆర్.ఆర్' నుంచి ఎటువంటి ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ విడుదల కావడం లేదనే విషయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను.. అధికారిక ఆంక్షల వలన కురదలేదని విన్నవించుకున్నాడు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిన్నటి నుండి తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉన్నారు. ఈరోజు కోలుకుని తారక్ బర్త్ డే ట్రెండ్స్ కోసం రెడీ అయిపోయారు.

ఈరోజు సాయంత్రం నుంచి ట్విట్టర్లో హంగామా మొదలు కాబోతోంది. ఫ్యాన్స్‌ ను ఖుషీ చేయడం కోసం ఎన్టీఆర్ టీమ్ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లే చేసినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం నుంచి అభిమానుల కోసం కొన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ రెడీ చేసి ఏ సమయానికి ఏం చేయాలో షెడ్యూల్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ పుట్టినరోజుకు ట్రెండ్ చేయాల్సిన హ్యష్ ట్యాగ్‌ ను ప్రకటిస్తారు. 8 గంటలకు ఎన్టీఆర్ మీద స్పెషల్ లైవ్ వైర్ డ్యాన్స్ వీడియో.. 9 గంటలకు లైఫ్ ఆఫ్ ఎన్టీఆర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. 10 గంటలకు దయా మాషప్.. 11 గంటలకు ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్స్ వీడియో రిలీజ్ చేస్తారు. ఇందులో ఫ్యాన్స్ గురించి తారక్ వివిధ సందర్భాల్లో ఇచ్చిన స్పీచ్‌ ల మాషప్ ఉంటుంది. 11 గంటలకు ఎన్టీఆర్‌ కు సంబంధించి అన్ సీన్ స్టిల్‌ తో విషెస్.. లైఫ్ ఆఫ్ ఎన్టీఆర్ ఫుల్ పిక్ రిలీజ్ చేస్తారు.

అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు ఎన్టీఆర్ అన్ సీన్ పిక్స్ రిలీజ్ చేస్తారు. ఇవన్నీ అఫీసియల్ హ్యాండిల్ 'ట్రెండ్ జూనియర్ ఎన్టీఆర్' నుంచి రాబోతున్నాయని సమాచారం. మరోవైపు హీరో ఎన్టీఆర్ కోసం 'మాస్ కా బాప్' ర్యాప్ సాంగ్ రిలీజ్ చేయనున్నాడు. తారక్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ కూడా ఒక సర్ప్రైజ్ తో రాబోతున్నాడు. ఇక తారక్ ఫ్యాన్స్ కోసం రేపు ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని మహేష్ కోనేరు చెప్తూనే వస్తున్నాడు. ఇప్పటికే 'అరాచకం' అంటూ తారక్ అన్ సీన్ పిక్ ఒకటి కోనేరు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసాడు. మొత్తం మీద ఎన్టీఆర్ మూవీ అప్డేట్ లేకపోయినా ఫ్యాన్స్ ని మాత్రం ఖుషీ చేసేలా షెడ్యూల్ అయితే ఉందని చెప్పవచ్చు.