Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో పనైపోయింది.. గుడ్ బాయ్

By:  Tupaki Desk   |   1 May 2018 11:55 AM IST
ఎన్టీఆర్ తో పనైపోయింది.. గుడ్ బాయ్
X
ఈ మధ్య మన హీరోల తీరు మారుతోందని వారి ఫిట్ నెస్ చూస్తేనే చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. సినిమా కథకు తగ్గట్టు సరికొత్త లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తున్నారు. గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ప్రతి సినిమాలో ఫిట్ నెస్ లో చాలా మార్పులు చేస్తున్నాడు. దర్శకుల ఆలోచనలకూ తగ్గట్టు తనను తాను చాలా మార్చుకుంటున్నాడు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కోసం కూడా తారక్ సరికొత్త ఫిట్ నెస్ తో సిద్దమయ్యాడు. ఎప్పుడు లేనంతగా ఈ సారి కొంచెం గట్టిగానే కష్టపడ్డాడు. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ తో గత కొంత కాలంగా బిజీగా వర్కౌట్స్ చేసి అనుకున్నట్టుగానే పూర్తిగా మారిపోయాడు. రీసెంట్ గా త్రివిక్రమ్ ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేసేశాడు. అయితే ఫైనల్ ట్రైనర్ స్టీవెన్స్ తారక్ కి బై చెప్పేశాడు.

తన పని పూర్తయ్యిందని తారక్ కి శిక్షణ ఇవ్వడం చాలా సంతోషానిచ్చిందని స్టీవెన్ చెప్పాడు. అంతే కాకుండా అతను తన ఫిట్ నెస్ తో అందరిని ఆకట్టుకుంటాడని గర్వంగా చెబుతున్నా.. ఇక తన పూర్తయ్యింది. నెక్స్ట్ ప్రాజెక్టు కోసం మళ్లీ తారక్కని త్వరలోనే కలుస్తా అని హైదరాబాద్ కి స్టీవెన్ గుడ్ బై చెప్పేశాడు. తారక్ నెక్స్ట్ రాజమౌలి మల్టి స్టారర్ #RRR లో నటించనున్న సంగతి తెలిసిందే.