Begin typing your search above and press return to search.
'పూజా హెగ్డే మంచి గుంటది' చిన్నారి కామెంట్.. పూజా ఫిదా
By: Tupaki Desk | 10 Nov 2020 4:00 PM ISTఓ చిన్నారి చేసిన కామెంట్‌కు నటి పూజా హెగ్డే ఫిదా అయిపోయింది. త్వరలోనే ఆ అమ్మాయిని కలుస్తానంటూ ట్వీట్ చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏమందంటే.. ఓ చిన్నారిని ఇటీవల ఓ వ్యక్తి నువ్వు పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు.. నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం ? అని ప్రశ్నించాడు. దీనికి ఆ చిన్నారి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ‘నాకు పూజా హెగ్డే అంటే చాలా ఇష్టం. నేను పెద్దాయ్యక పూజా హెగ్డే నవుతా’ అంటూ అని అమ్మాయి చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అటు ఇటు తిరిగి బుట్ట బొమ్మ పూజా వద్దకు వెళ్లింది.చిన్నారి మాటలు విన్న పూజా.. ఫిదా అయిపోయింది. వెంటనే రీ ట్వీట్ చేసింది.
‘ ఓ మై గాడ్ .. చిన్న అమ్మాయి ఈ రోజును నా జీవితంలో పరిపూర్ణం చేసింది. ఆ చిన్నారి బుగ్గలు ఎంత బాగున్నాయో.. చిన్నారికి నా ప్రేమను, ముద్దులను ఈ ట్వీట్ ద్వారా పంపిస్తున్నా. ఏదో ఒకరోజు చిన్నారిని కలుసుకుంటా’ అంటూ పూజా హెగ్డే రీ ట్వీట్ చేసింది. అయితే ఇటీవల పూజ హెగ్డే చేసిన ఓ కామెంట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘ సౌత్ వాళ్లకు నడుముపై పిచ్చి ఎక్కువగా ఉంటుంది’ అంటూ పూజా కామెంట్ చేశారు. ఈ మాటలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. పూజాపై కొన్ని నెగిటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. వెంటనే ఆ మాటలను కవర్ చేసేందుకు పూజ ట్రై చేసింది. ‘నాకు సౌత్వాళ్లంటే ఎంతో గౌరవం. నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిని కొంత బిట్‌ను తీసుకొని కొందరు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ నాకు ప్రాణ సమానం’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా ప్రభాస్ రాధేశ్యామ్‌తో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.