Begin typing your search above and press return to search.

2019 రౌండప్: టాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితి ఇది!

By:  Tupaki Desk   |   30 Dec 2019 9:54 AM GMT
2019 రౌండప్: టాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితి ఇది!
X
మరొక్క రోజు. అంతే ఈ ఏడాదికి ముగింపు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఇలాంటి సమయంలోనే ఈ ఏడాదికి సంబంధించిన విశేషాలు ఒక్కసారి నెమరు వేసుకుంటాం కదా. టాలీవుడ్ లో బెస్ట్ సినిమాలు.. వరస్ట్ సినిమాలు.. ఎవరికీ కలిసొచ్చింది.. ఎవరికి కలిసిరాలేదు అనే విషయంలో చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ల విషయం తీసుకుంటే టాప్ హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ లిస్టులో హీరోయిన్లు నటించిన తెలుగు సినిమాలు మాత్రమే పరిగణన లోకి తీసుకున్నాం.


తమన్నా: ఈ ఏడాది తమన్నా నటించిన సినిమాలు అత్యధికం గా నాలుగు రిలీజ్ అయ్యాయి. 'F2'.. 'అభినేత్రి2'.. 'సైరా'.. 'యాక్షన్'. వీటిలో 'F2 సూపర్ డూపర్ హిట్.. 'సైరా' తెలుగు వరకూ చూసుకుంటే భారీ కలెక్షన్స్ సాధించింది. ఇగాతా రెండు సినిమాలు ఫ్లాపులు. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే తమన్నా ఈ ఏడాది టాప్ హీరోయిన్ స్థానంలో దక్కుతుంది. ఎందుకంటే 'F2'.. 'సైరా' సినిమాల కలెక్షన్స్ భారీ స్థాయి లో ఉన్నాయి. ఇక 'సైరా' తమన్నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది.

పూజ హెగ్డే: పూజ ఈ ఏడాది 'మహర్షి'.. 'గద్దలకొండ గణేష్' సినిమాల్లో నటించింది. మహేష్ సినిమా హిట్ లెక్కలోనే జమకట్టాలి. ఇక 'గద్దలకొండ గణేష్' సినిమా లో పూజ గ్లామర్ కు మరోసారి భారీ స్పందన దక్కింది. ఓవరాల్ గా చూస్తే ఈ ఏడాది పూజ హెగ్డేకి కెరీర్ కు ప్లస్ అయిందనే చెప్పాలి.

సమంతా: ఈ ఏడాది సమంతా నటించిన సినిమాలు రెండు రిలీజ్ అయాయి. 'ఓ బేబీ'.. 'మజిలీ'. రెండూ హిట్లే. ముఖ్యంగా 'మజిలీ' లో సమంతా నటనకు భారీ ప్రశంసలు దక్కాయి. నటన పరంగా ఓకే కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే రెండూ మిడ్ రేంజ్ సినిమాలే. ఇక పెద్ద స్టార్ హీరోల అవకాశాలు రాక పోవడం పెద్ద లోటే. అయినా సమంతాకు ఈ ఏడాది 100 % సక్సెస్ రేట్.. కలిసొచ్చింది అనే చెప్పాలి.

కాజల్: కాజల్ ఈ ఏడాది 'సీత'.. 'రణరంగం'. రెండూ సినిమాలు ఫ్లాప్ విషయం లో ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి. కాజల్ మర్చిపోదగ్గ సంవత్సరం. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

రకుల్: రకుల్ 2019 లో మొత్తం మూడు సినిమాలలో నటించింది. 'దేవ్'.. 'NGK'.. 'మన్మథుడు 2' .. మూడూ కళాఖండాలే. ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాపు. 'మన్మథుడు 2' సినిమా అయితే రకుల్ కెరీర్ కు దాదాపుగా చరమగీతం పాడిందనే కామెంట్లు వినిపించాయి. ఇది రకుల్ కు టాలీవుడ్ లో డిజాస్టర్ ఇయర్ అని చెప్పొచ్చు.

రష్మిక: రష్మిక నటించిన సినిమా ఈ సంవత్సరంలో ఒకటే రిలీజ్ అయింది. అదే 'డియర్ కామ్రేడ్'. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సుమంది. చేదు అనుభవాన్ని మిగిల్చింది.


ఓవరాల్ గా లిస్టు గమనిస్తే ఒకటి అర్థం అవుతుంది. 100% సక్సెస్ రేట్ తో సమంతా మొదటి స్థానం లో నిలుస్తుంది. అయితే స్టార్ హీరోల సినిమాలు.. కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం తమన్నా టాప్ లో నిలుస్తుంది.