Begin typing your search above and press return to search.

#పూజా.. త‌న హీరోల్ని వ‌ర్ణిస్తోందా.. బిస్కెట్ వేస్తోందా?

By:  Tupaki Desk   |   20 Dec 2020 5:30 AM GMT
#పూజా.. త‌న హీరోల్ని వ‌ర్ణిస్తోందా.. బిస్కెట్ వేస్తోందా?
X
అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్ తర్వాత బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే లైన‌ప్ చూస్తే మ‌రింత క్రేజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ ‌లో పలు భారీ క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. ప్రభాస్- రణవీర్ సింగ్ - సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ బిజీగా ఉంది. రాధే శ్యామ్- సిర్కస్ - కబీ ఈద్ కబీ దీవాళి(స‌ల్మాన్) వంటి చిత్రాలలో నటిస్తోంది.

తాజా ఇంట‌ర్వ్యూలో పూజా ఆ ముగ్గురు స్టార్ హీరోల‌ గురించి ఫన్నీ వర్ణణ చేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. రెబెల్ స్టార్ -గూఫీ అని.. అతను ఒక్క‌డే క‌నిపించినా ఇక ఇంట‌ర్వ్యూల్లో సిగ్గు ప‌డ‌డు అని ఫ‌న్నీగా చెప్పేసింది.

పూజా తన సిర్కస్ సహనటుడు రణవీర్ సింగ్ ను `బాల్ ఆఫ్ ఎనర్జీ` అని వ‌ర్ణించింది. చివరగా సల్మాన్ గురించి చెబుతూ..``పట్టణంలో చక్కని వ్యక్తి.. నిజమైన అరుదైన వ్యక్తి`` అని అభివర్ణించింది. త‌న హీరోల్ని ఎంత గొప్ప‌గా వ‌ర్ణించిందో క‌దా!! అన్న‌ట్టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అఖిల్ గురించి ఏమీ చెప్పనే లేదేంట‌బ్బా!! ఇంత‌కీ పూజా.. త‌న హీరోల్ని వ‌ర్ణిస్తోందా.. బిస్కెట్ వేస్తోందా? తొంద‌ర్లేనే తేల్తుంది!