Begin typing your search above and press return to search.

నరకం అంచుల్లో కరగని మంచుకొండ

By:  Tupaki Desk   |   8 July 2015 9:22 PM IST
నరకం అంచుల్లో కరగని మంచుకొండ
X
నరాలు మెలిపెట్టే బాధను దిగమింగుకోవాలి. నరకం అంచుల్లో ఉన్నా స్వర్గంలోంచి ఇప్పుడే వస్తున్న ఫీలింగ్‌ చూపించాలి. బాధ తాలూకూ సింప్టమ్స్‌ని అస్సలు బైటికి తెలియనివ్వకూడదు. ఇలాంటి పనులు ఓ క్యాన్సర్‌ పేషెంట్‌కి సాధ్యమా అంటే సాధ్యమేనని నిరూపించి చూపించింది లీసారే.

అత్యంత అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ సుందరాంగి ఇప్పటికీ నవయవ్వన కాంతులతో తులతూగుతోంది. బాడీలో క్యాన్సర్‌ సెల్స్‌లో కంట్రోల్‌లో ఉన్నా డిసీజ్‌ పూర్తిగా క్యూర్‌ కాలేదు. కాని అమ్మడు 40 ప్లస్‌లోనూ టీనేజీ అమ్మాయిలా ఫోటోషూట్‌లకు ఫోజులిస్తూ తళతళలాడుతోంది. 2002లో మహేష్‌ బాబు సరసన 'టక్కరి దొంగ'లో నటించిన లీసా ఓ ఎన్నారై ఇండియన్‌. అమ్మడుకు 2009లో మల్టిపుల్‌ మైలోమా అనే అరుదైన క్యాన్సర్‌ రావడంతో, ఈమె బాహ్య ప్రపంచం నుంచి మిస్సయ్యింది. మంచి ఆహారపు అలవాట్లు, యోగా, ధ్యానం సాధనతో ప్రస్తుతం మనసులోని బాధల్ని అధిగమిస్తోంది.

ప్రముఖ మ్యాగజైన్‌ జీక్యూకి లేటెస్టుగా ఫోటోషూట్‌ ఇచ్చిందిలా. ఆ ఫోటో ఇదే. 43 వయసులోనూ క్యాన్సర్‌ను ఎదుర్కొంటూ ఈ రేంజులో అందాల్ని మెయింటెయిన్‌ చేస్తోంది అంటే అది లీసారే పట్టుదల అని చెప్పొచ్చు. కుర్రాళ్లు ఈ ఫోజులు చూసి మెలికలు తిరిగిపోయి కరిగిపోతున్నారు.