Begin typing your search above and press return to search.

తొలిసారి కూతురు ఫోటో షేర్ చేసింది.. చూస్తే అభినందిస్తారంతే

By:  Tupaki Desk   |   16 Aug 2021 2:43 PM IST
తొలిసారి కూతురు ఫోటో షేర్ చేసింది.. చూస్తే అభినందిస్తారంతే
X
జీవితాల్ని పూర్తిగా ప్రైవేటు అనేస్తారు. మరికొందరు అందుకు భిన్నంగా అన్ని ఓపెన్ గా పంచేసుకుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వేరియేషన్ ఇప్పుడు మరింత బాగా కనిపిస్తుంటుంది. ఇందుకు భిన్నంగా మరో బ్యాచ్ ఉంది. వారు తాము కోరుకున్నప్పుడు ప్రైవేటు అనుభూతుల్ని సైతం పబ్లిక్ గా చెప్పేస్తుంటారు. అయితే.. అంతా తమ ఇష్టమని.. తమకు తోచినప్పుడు మాత్రమే తమ వివరాలు.. సంగతులు వెల్లడిస్తామన్నట్లుగా ఉంటుంది వారి తీరు చూస్తే.

చెన్నైకి చెందిన మోడల్ కమ్ నటి లీసా హెడెన్ సంగతే తీసుకోండి. ఆమెకు నచ్చినప్పుడు ప్రైవేటు విషయాల్ని కూడా పంచేసుకుంటారు. అదే సమయంలో చెప్పకూడదనుకున్నప్పుడు ముడుచుకుపోతారు. పుట్టిన బిడ్డ ఆడ.. మగ అన్నది చెప్పటానికి కూడా ఇష్టపడరు. మళ్లీ ఏదైనా కారణంతో.. చెప్పాలనుకున్నప్పుడు ప్రపంచానికి చెప్పేస్తుంటారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన లీసా హెడెన్.. ముచ్చటగా మూడోసారి అమ్మ అయిన వేళ.. తాను జన్మనిచ్చింది అబ్బాయికా? అమ్మాయికా? అన్న విషయం మీద కనీస సమచారాన్ని ఇవ్వలేదు. గుట్టుగా ఉంచేవారు. ఆమెను అభిమానించే వారు ఎంత అడిగినా.. మౌనంగా ఉన్నారే తప్పించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

అలాంటి లీసా తన తీరుకు భిన్నంగా తాజాగా కొన్ని ఫోటోల్ని షేర్ చేశారు. అందులోతనకు పుట్టింది అమ్మాయి అని.. ఆమె పేరు లారా అని చెప్పటమే కాదు.. ఆమెకు పాలు పడుతున్న ఫోటోల్ని ఆమె పోస్టు చేశారు. 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడిన ఆమెకు ఇద్దరు మగ పిల్లలు. మూడో బిడ్డకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని నెలలుగా గుట్టుగా ఉంచిన ఆమె.. తాజాగా బయటపెట్టింది. తల్లిపాల వారోత్సవంలో భాగంగా.. తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. ఆ విషయంలో అందరు తల్లులు తమ బాధ్యతల్ని నిర్వర్తించాలన్న ఆలోచనతో ఆమె తన కుమర్తె కు పాలు పడుతున్న ఫోటోల్ని పోస్టు చేశారు. తాజాగా ఆమె చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూస్తుంటే.. గడిచిన కొద్ది కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నఆమె ఇకపై మళ్లీ యాక్టివ్ గా ఫోటోలు షేర్ చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.