Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వైటులో హాటుగా రచ్చ

By:  Tupaki Desk   |   12 April 2018 6:40 AM GMT
ఫోటో స్టోరి: వైటులో హాటుగా రచ్చ
X
ఇండియాలో సూపర్ మోడల్ ఇమేజ్ సంపాదించుకున్న కొద్ది మందిలో లీసా హేడెన్ కూడా ఉంటుంది. సూపర్ మోడల్ అనిపించుకోవడమే కాదు.. ఆ పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో లీసా కచ్చితంగా కనిపిస్తుంది. అంతటి ఇమేజ్ ఉన్న లీసా హెడెన్.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అందాలతో మెరిసిపోతూ ఉంటుంది.

ప్రస్తుతం ఈమె వయసు 31 సంవత్సరాలు అయినా.. జస్ట్ టీనేజ్ ప్లస్ అనిపించడంలో ఈమె బాగా దిట్ట. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఫోటోషూట్ చేసింది. దీనిలో అమ్మడు పంచిన అందాలు అద్భుతం అనాల్సిందే. పైగా కొత్త తరహాగా ట్రై చేసి మరింతగా ఆకట్టుకుంది లీసా. ముఖ్యంగా హెయిర్ ను వైట్ కలర్ తో భలే మెరుపులు కురిపించింది. ఇలా ఓ చెన్నై బ్యూటీ వైట్ లో బ్రైట్ గా మెరిసిపోవడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. గభాలున చూస్తే ఫారిన్ అమ్మాయి ఇలా మెరుపులు కురిపిస్తోందా అనిపించేసినా ఆశ్చర్యం ఏమీ లేదు. ఇక ఈ భామ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం చాలా ఎంపికగా మెరుస్తూ ఉంటుంది.

టాలీవుడ్ వరకు అయితే రామ్ చరణ్ రచ్చ మూవీలో ఐటెం సాంగ్ చేసిన ఈ భామ.. బాలీవుడ్ తో కలిపి చేసిన సినిమాల కౌంట్ కూడా రెండంకెల స్థాయికి చేరదు. సినిమాల్లో అంతగా కనిపించకపోయినా.. సూపర్ మోడల్ గా ఈమెకు ఉన్న ఇమేజ్ మాత్రం అసామాన్యం అనాల్సిందే.