Begin typing your search above and press return to search.

లిప్‌ లాక్‌ ప్రాక్టీసా?? ఏం స్టంట్ గురూ

By:  Tupaki Desk   |   7 Jun 2016 5:30 PM GMT
లిప్‌ లాక్‌ ప్రాక్టీసా?? ఏం స్టంట్ గురూ
X
పబ్లిసిటీకి కాదేదీ అనర్హం. ముఖ్యంగా సినిమా పబ్లిసిటీ కోసం అయితే.. రకరకాల పాట్లు పడిపోతున్నారు. ఇందులో కాస్త శృతి మించిన ఎపిసోడ్స్ కూడా అప్పుడప్పుడూ పడుతున్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ మించిన ఓ సూపర్బ్ సీన్ ని మేకింగ్ వీడియోగా వదిలారు. ఫైట్లు - పాటలు - సీన్స్ - సెట్స్ - డెకరేషన్ - మేకప్.. ఇలాంటివన్నీ జనాలు చూసేశారు.. కొత్తగా ఏదన్నా చేద్దామని అనుకుంది ఓ మూవీ యూనిట్. అందుకే వెరైటీగా ఉంటుందని లిప్ లాక్ సన్నివేశానికి సంబంధించి.. హీరో - హీరోయిన్లు ప్రాక్టీస్ చేసుకుంటున్న సీన్ ని మేకింగ్ వీడియో అంటూ జనాలపైకి వదిలేశారు.

'అర్జున్ రెడ్డి'.. ఇదీ మూవీ టైటిల్. ఎవడే సుబ్రమణ్యంలో నానితో పాటు లీడ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ పేరు శాలిని వడ్నికత్తి. హీరోయిన్ ని గోడకు ఆనించి.. హీరో బాబు ముద్దు పెట్టడం ప్రాక్టీస్ చేస్తున్నాడు.

అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఎలా పెట్టాలో ఫీలింగ్స్ ఎలా ఇవ్వాలో పక్కనుంచి డైరెక్టర్ సజెషన్స్ కూడా ఇస్తున్నాడు. వీటికంటే రోత పుట్టించే విషయం ఏంటంటే.. ముద్దు పెట్టినట్లు కాసేపు ఉన్న తర్వాత.. నోట్లోంచి ఏదో తీసి పడేసి నవ్వుకుంటున్నాడు ఈ హీరో. వాటే వరస్ట్ పబ్లిసిటీ యార్. టాలీవుడ్ లో పబ్లిసిటీ పిచ్చి పీక్స్ లోకి వెళ్లిపోయిందనడానికి ఈ అర్జున్ రెడ్డి మేకింగ్ వీడియో సరైన ఉదాహరణ.