Begin typing your search above and press return to search.

కిస్ చేసి చూడు

By:  Tupaki Desk   |   29 Jan 2018 4:43 PM IST
కిస్ చేసి చూడు
X
ఈ శుక్రవారం విడుదల అవుతున్న మాస్ మహా రాజా టచ్ చేసి చూడుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రెండేళ్ళు గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ పవర్ తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో చూచాయగా కథేంటో చెప్పినప్పటికీ తనకు మాత్రమే సొంతమైన ఎనర్జీతో రవితేజ మరోసారి అదరగొట్టినట్టే అనిపిస్తోంది. మొన్న జరిగిన ఆడియో ఫంక్షన్ లో యూనిట్ సభ్యులంతా విజయం గురించి నమ్మకం వ్యక్తం చేసారు. ఇది కామనే కాని కెమరామెన్ చోటా కె నాయుడు మాత్రం ఒక సీన్ గురించి చాలా స్పెషల్ అంటూ ఊరిస్తూ చెప్పే ప్రయత్నం చేయటం, దానికి రవితేజ వద్దు అని వారించడం అందరి దృష్టిలో పడింది. అంత ప్రత్యేకమైన సీన్ ఏంటబ్బా అని ఫాన్స్ సైతం తెగ ఆలోచించారు.

ఏతావాతా విషయం ఏంటంటే ఆ సీన్ రవితేజ - హీరొయిన్ రాశి ఖన్నా మధ్య లిప్ లాక్ కిస్ గురించట. కాస్త సుదీర్ఘంగా ఉండే ఆ సీన్ ని పలుమార్లు రీ షూట్ చేయాల్సి రావడాన్ని చోటా కె నాయుడు ఫుల్ గా ఎంజాయ్ చేసాడట. అందుకే అదే పనిగా దాని గురించి ప్రస్తావించబోయి ఆగిపోయాడు. జనవరిలో వచ్చిన సినిమాల్లో భాగమతి మంచి వసూళ్లతో దూసుకుపోతుండగా, జైసింహ పెట్టిన పెట్టుబడి పరంగా పర్వాలేదు అనిపించాడు. ఇంకా బలమైన సాలిడ్ హిట్ కావలసిన నేపధ్యంలో వస్తున్న టచ్ చేసి చూడు గురించి సామాన్య ప్రేక్షకుల్లో కూడా హైప్ బాగా ఉంది. విక్రం సిరికొండ టేకింగ్ ట్రైలర్ లోనే మెప్పు పొందింది.

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ ఇందులో కనిపించబోతున్నాడు. సెకండ్ హీరొయిన్ గా నటిస్తున్న సీరత్ కపూర్ పాత్ర సెకండ్ హాఫ్ లోనే ఎంటర్ అవుతుంది. అది రవితేజ ఫ్లాష్ బ్యాక్ గా ఉంటుందని టాక్. ఇప్పటికే మ్యూజిక్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా పోటీకి ఏ సినిమా లేదు కాబట్టి ఓపెనింగ్స్ పరంగా రవితేజ తన సినిమాల వరకు మంచి రికార్డు దక్కించుకునేలా ఉన్నాడు. ఆ తరువాతి వారం నుంచి వరసబెట్టి సినిమాల తాకిడి ఉంది. రవితేజ కనక స్ట్రాంగ్ గా కంటెంట్ తో కొడితే ఓకే. ఆ నమ్మకంతోనే ఎదురు చూస్తున్నారు ఫాన్స్.