Begin typing your search above and press return to search.

'గీత గోవిందం' లో హాట్ లిప్ లాక్స్

By:  Tupaki Desk   |   12 Aug 2018 5:30 PM GMT
గీత గోవిందం లో హాట్ లిప్ లాక్స్
X
రాబోయే బుధవారం విడుదల కాబోతున్న ‘గీత గోవిందం’ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు ఆన్ లైన్ లో లీక్ అయిపోవడం సంచలనం రేపుతోంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ విభాగంలో పని చేస్తున్న ఒక వ్యక్తే పోస్ట్ ప్రొడక్షన్ టైంలో డేటా కాపీ చేసి దాన్ని కొన్నీ సీన్లను లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు విద్యార్థులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై గీతా ఆర్ట్స్ టీం చాలా సీరియస్ గానే స్పందించింది. అందరిపై పోలీసు కేసులు పెట్టింది. ప్రధాన నిందితుడితో పాటు కొందరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ‘గీత గోవిందం’ లీక్డ్ కంటెంట్ లోని కొన్ని దృశ్యాల్ని బ్రేక్ చేసి యూట్యూబ్ లోనూ వదిలేశారు కొందరు ప్రబుద్ధులు. బ్యాగ్రౌండ్ స్కోర్ - సరైన ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మామూలుగా అనిపిస్తున్నాయట ఆ సీన్స్.

కానీ అందులోని కంటెంట్ మాత్రం కుర్రాళ్లకు వేడి పుట్టించేలా ఉందట. ఒక ట్రావెల్ బస్సులో వెళ్తూ హీరో హీరోయిన్ లిప్ లాక్ చేసుకునే దృశ్యానికి సంబంధించిన వీడియో యూట్యూబ్ సహా కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో హల్ చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కిస్ కొంచెం ఘాటుగానే ఉందంటుున్నారు. ఆల్రెడీ తన తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’ హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న రష్మిక ఇలాంటి ముద్దు సీన్ ఎలా చేసిందని సోషల్ మీడియాలో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఐతే ఈ సీన్ సినిమాలో ఉందా.. లేక ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎగిరిపోయిందా అన్నది తెలియడం లేదు. ఈ సన్నివేశం సినిమాలో ఉంటే మాత్రం థియేటర్లలో కుర్రాళ్లు గోల గోల చేసేస్తారు. మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘గీత గోవిందం’ను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాల్లో ఉండగా.. ఇలా జరగడం చిత్ర బృందాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.