Begin typing your search above and press return to search.

పిక్ టాక్: హోళీ స్పెషల్ గా 'ఆకాశ వీధుల్లో' లిప్ లాక్..!

By:  Tupaki Desk   |   29 March 2021 8:30 AM GMT
పిక్ టాక్: హోళీ స్పెషల్ గా ఆకాశ వీధుల్లో లిప్ లాక్..!
X
గౌత‌మ్ కృష్ణ హీరోగా న‌టిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా ''ఆకాశ వీధుల్లో''. 'రంగ‌స్థ‌లం' 'క‌ల్కి' వంటి చిత్రాల‌లో మెరిసిన వైజాగ్ భామ పూజిత పొన్నాడ‌‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే డైరెక్ట‌ర్ క్రిష్ చేతుల మీదుగా విడుదలైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు.. మేక‌ర్స్ రిలీజ్ చేసిన రొమాంటిక్ లుక్‌ కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో నేడు హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని మరో రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేస్తూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

'ఆకాశ వీధుల్లో' చిత్రం నుంచి 'అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో..' అంటూ సాగే పాటను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ స్వరపరిచిన ఈ గీతాన్ని మ్యూజిక్ సెన్సేషనల్ సిద్ శ్రీరామ్ ఆలపించడం విశేషం. ఈ సందర్భంగా వదిలిన కలర్ ఫుల్ రొమాంటిక్ పోస్టర్ లో పూజిత‌ పొన్నాడ - గౌత‌మ్ లిప్ లాక్ స్టిల్ కుర్ర‌కారును అలరిస్తోంది. రొటీన్‌ కు భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీకే ఫిల్మ్ ఫ్యాక్టరీమరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై మనోజ్ జే.డీ - డీ.జె. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విశ్వనాథ్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.