Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని ప‌రేషాన్ చేస్తున్న హీరో పెద‌వి ముద్దులు!

By:  Tupaki Desk   |   10 May 2022 12:30 AM GMT
ఫ్యాన్స్ ని ప‌రేషాన్ చేస్తున్న హీరో పెద‌వి ముద్దులు!
X
మాస్ రాజా ర‌వితేజ 'క్రాక్' స‌క్సెస్ తో లైన్ లోకి వ‌చ్చినా మ‌ళ్లీ 'ఖిలాడీ' ఫెయిల్యూర్ తో సీన్ మారిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల‌ మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా ఫలితం తీవ్ర నిరాశ‌ని మిగిల్చింది. 'ఖిలాడీ' ప‌రాజ‌యంతో క్రాక్ స‌క్సెస్ ని కంటున్యూ చేయ‌లేకపోయాడు. ఈ సినిమా ఫెయిల్యూర్ కి చాలా కార‌ణాలున్నాయి. కంటెంట్ లోపంతో పాటు రొటీన్ ఊక దంపుడు సినిమా కావ‌డంతో అభిమానుల‌కి రుచించ‌లేదు.

ఇక ఇందులో హీరోయిన్లు డింపుల్ హ‌య‌తి...మీనాక్షి చౌద‌రి కేవ‌లం గ్లామ‌ర్ ఎలివేష‌న్ల‌కే ప‌రిమితం. హీరోతో రొమాంటిక్ స‌న్నివేశాలు అంతే హైలైట్ మ‌రి. ఇద్ద‌రి హీరోయిన్ల‌తో మాస్ రాజా పెద‌వి తాంబులాలు అందుకుంటాడు. ఇక అంత‌కు ముందు 'కిక్-2'లో ర‌కుల్ ప్రీత్ సింగ్ తోనూ లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించాడు రాజా.

'ప‌వ‌ర్' చిత్రంలోనూ రెజీనా క‌సాండ్రా తోనూ లిప్ లాక్ వేసారు. అయితే ఈ సినిమాలేవి బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌లేదు. 'ప‌వ‌ర్' మిన‌హా చిత్రాల‌న్ని దారుణ‌మైన ఫ‌లితాలు సాధించాయి. ఇప్పుడు తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'లో నూ ర‌వితేజ‌-హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌కు కొద‌వ‌లేద‌ని తెలుస్తుంది.

లిప్ లాక్ స‌న్నివేశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడీ లిప్ లాక్ స‌న్నివేశ‌మే అభిమానుల్ని ప‌రేషాన్ చేస్తోంది. ఇటీవ‌లి కాలంలో ర‌వితేజ లిప్ లాక్ ల్లో న‌టించిన సినిమాలేవి ఆశాజ‌న‌కంగా లేవు. రామారావు కూడా ఆ ఖాతాలో చేరుతుందా? అన్న ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. ప్ర‌స్తుతం రామారావు సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

అన్ని ప‌నులు పూర్తిచేసి జూన్ 17న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా స‌క్సెస్ సాధించ‌డం రాజాకి అనివార్య‌మే. 'ఖిలాడీ' ఫెయిల్యూర్ తో మ‌ళ్లీ పాత రూట్లోకే వెళ్లిపోతున్నాడు అన్న విమ‌ర్శ వినిపిస్తుంది. ఇదే వేవ్ లో మరో ఫెయిల్యూర్ అంటే ప‌రిస్థితి మారిపోతుంది. న‌టుడిగా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ వ‌రుస ఫెయిల్యూర్స్ మార్కెట్ పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఈ అందోళ‌నే అభిమానుల నుంచి వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం ర‌వితేజ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న మూడు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. 'రావ‌ణాసుర‌'..'ధ‌మాకా'.. 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఏడాది చివ‌ర్లో గానీ..వ‌చ్చే ఏడాది గానీ ఈ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.