Begin typing your search above and press return to search.

ఆ లిప్ కిస్ పెళ్లికి దారితీసినట్లుంది

By:  Tupaki Desk   |   23 Aug 2016 11:00 PM IST
ఆ లిప్ కిస్ పెళ్లికి దారితీసినట్లుంది
X
ఈ మధ్యనే హీరో జెడి చక్రవర్తి తాను ప్రేమించిన మోడల్ కమ్ నటి అనుకృతి గోవింద్ శర్మను పెళ్ళిచేసుకున్నాడు. అయితే వీరి ప్రేమాయణం ఎలా ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనే విషయం పెద్దగా తెలియదు కాని.. ఇప్పుడు ఒక లిప్ కిస్ వీరి ప్రేమకు పునాది వేసిందని తెలుస్తోంది.

ఎప్పటినుండో హైదరాబాద్ లో మోడల్ గా షాపు ఓపెనింగులకు.. ర్యాంప్ వాకులకు.. విచ్చేస్తున్న అనుకృతి... రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ''సావిత్రి'' (ముందులో ఈ సినిమా పేరు శ్రీదేవి)లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పూర్తయ్యిందో లేదో తెలియదు కాని.. ఇంకా రిలీజ్ మాత్రం కాలేదు. ఆ సినిమాలో సదరు సావిత్రి భర్త పాత్రలో జెడి చక్రవర్తి నటించాడట. ఆ సమయంలో ఇద్దరి మీదనా ఒక లిప్ కిస్ తీశారు. ఆ ఘాటు లిప్ కిస్ కోసం కాస్త ఘాడంగానే కష్టపడిన ఇరువురూ.. అప్పటినుండి డేటింగ్ మొదలెట్టారట. అంటే ఆ లిప్ కిస్సుతో వీరిలో ప్రేమ సెగలకు కరెంట్ పాసయ్యిందనమాట.

ఇంతకీ ''సావిత్రి'' సినిమా రిలీజవుతుందా? ఆ సినిమా ఒకవేళ రిలీజ్ అయితే అందులో ఈ లిప్ లాక్ ఉంచుతారా? తొలిసారిగా వెండితెర మీద ముద్దెట్టేసుకున్న నిజజీవితపు కపుల్ అనే రికార్డును జెడి చేతిలో పెట్టేస్తారా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు!!