Begin typing your search above and press return to search.

ఇతను బన్నీకి.. అతను ఎన్టీఆర్ కు..

By:  Tupaki Desk   |   10 Sept 2016 11:30 AM
ఇతను బన్నీకి.. అతను ఎన్టీఆర్ కు..
X
ఫిలిం ఇండస్ర్టీలో అంతేగా. మనోళ్లు ఒక సినిమాను పూర్తిగా సెట్స్ మీదకు వెళ్లే వరకు.. అసలు ఆ సినిమాలో ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం పూర్తిగా చెప్పలేరు. సరిగ్గా ముహూర్తానికి ముందురోజు హీరోయిన్ మారుతుంది.. షూటింగుకు ముందు రోజు మ్యూజిక్ డైరక్టర్ మారతాడు.. అసలు షూటింగ్ మధ్యలో ఉండగా కూడా సీన్లు మారిపోతాయిలే.

ఒక ఆసక్తికరమైన న్యూస్ ఏంటంటే.. వరుసగా నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్.. వంటి డిఫరెంట్ సినిమాలను చేసి మాంచి పేరు కొట్టేయడంతో ఇప్పుడు మాస్ సినిమాలను చేయకూడదు అనుకుంటున్నాడు ఎన్టీఆర్. అందుకే వక్కంతం వంశీ చెప్పిన కథ గురించి సెకండ్ థాట్ లో పడ్డాడు. అయితే ఎన్టీఆర్ ఇంకా డీలే చేసేలా ఉన్నాడని ఫీలైన మన డైరక్టర్.. వెంటనే అల్లు అర్జున్ ను ఎప్రోచ్ అయ్యి కథ చెప్పాడని టాక్ వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని.. ఇప్పుడు బన్నీ దగ్గర వెయిటింగ్ లిస్టులో ఉన్న ఇంకొక డైరక్టర్.. ఎన్టీఆర్ ను ఎప్రోచ్ అయ్యాడు తెలుసా?

అసలు సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాకంటే ముందే.. బన్నీ తమిళ డైరక్టర్ లింగుస్వామితో ఒక సినిమాను చేయాలి. అయితే ఆ ప్రాజెక్టు వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పుడు సరైనోడు సినిమా అయ్యాకైనా అది టేకాఫ్‌ అవుతుంది అనుకుంటే.. చివరకు హరీశ్‌ శంకర్ లైన్లోకి వచ్చాడు. అందుకే లింగుస్వామి ఆ కథను తీసుకుని ఎన్టీఆర్ దగ్గరకు వచ్చాడట. వినగానే యంగ్ టైగర్ పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది. భలే ఉంది కదండీ ఈ డైరక్టర్ల పరిస్థితి.