Begin typing your search above and press return to search.

3డిలో స్ట్రీట్ డ్యాన్స‌ర్స్ ర‌చ్చేనా

By:  Tupaki Desk   |   5 Feb 2019 10:31 AM GMT
3డిలో స్ట్రీట్ డ్యాన్స‌ర్స్ ర‌చ్చేనా
X
వీధుల్లో న‌డిచి వెళితే కొత్త‌గా చెప్పుకోవ‌డానికి ఏం ఉంటుంది? అదే ఒళ్లంతా స్ప్రింగులా మార్చి డ్యాన్సాడుతూ వెళితే అది చూసేవాళ్ల‌కు కొత్త‌.. వీధి వీధినా వినోదం పుష్క‌లంగా ల‌భిస్తుంది. స‌రిగ్గా ఇదే పాయింట్ తో తెర‌కెక్కించిన సినిమా `స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డి` అని చెబుతున్నాడు వ‌రుణ్ ధావ‌న్. ఈ యంగ్ బోయ్ క‌థానాయ‌కుడిగా రెమో.డి.సౌజా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్ఠాత్మ‌క‌ టీ సిరీస్ అధినేత‌ భూష‌ణ్ కుమార్ నిర్మిస్తున్న `స్ట్రీట్ డ్యాన్స‌ర్` న‌వంబ‌ర్ 8న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలోనూ వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

వ‌రుణ్ - శ్ర‌ద్ధా జంట అన‌గానే అంద‌రిలో ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్. ఈ సినిమా ఏబీసీడీ సిరీస్ లో వ‌స్తున్న మూడో సినిమానా? ఏబీసీడీ 3 ఇదేనా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. అయితే ఇది ఏబీసీడీ 3 కాదు. పూర్తిగా వేరొక సిరీస్ అని భూష‌ణ్ కుమార్ తెలిపారు. స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డి అనేది ప్ర‌త్యేకించి ఓ సిరీస్ లా రూపొందిస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. స్ట్రీట్ డ్యాన్స‌ర్లుగా శ్ర‌ద్ధా క‌పూర్, వ‌రుణ్ ధావ‌న్ ల లుక్ ని లేటెస్ట్ గా లాంచ్ చేశారు. పోస్ట‌ర్లు స్ట‌న్నింగ్ లుక్ తో ఆక‌ట్టుకున్నాయి. అలాగే టైటిల్ ని వ‌రుణ్ ధావ‌న్ స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు షేర్ చేశాడు.

ముఖ్యంగా బాలీవుడ్ లోనే బెస్ట్ డ్యాన్స‌ర్లుగా వ‌రుణ్ ధావ‌న్, శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌కు పేరుంది. హృతిక్, టైగ‌ర్ ష్రాఫ్ త‌ర్వాత ఆ స్థాయిలో డ్యాన్సులు చేయ‌గ‌లిగే స‌త్తా ఉన్న యంగ్ హీరోగా ధావ‌న్ ని ప్ర‌పంచం గుర్తించింది. ఇక శ్ర‌ద్ధా క‌పూర్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. రెమో డిసౌజా తెర‌కెక్కించిన‌ ఏబీసీడీ 2లో వ‌రుణ్‌ ధావ‌న్ - శ్ర‌ద్ధా క‌పూర్ డ్యాన్సులు కుర్ర‌కారును క‌ళ్లు తిప్పుకోనివ్వ‌లేదు. అందుకే ఈసారి స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డిలో ఇంకే రేంజులో డ్యాన్సులు చేయ‌బోతున్నారో? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. మ‌రోవైపు ఏబీసీడీ 3 చిత్రం కూడా రెమో డి.సౌజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఒకేసారి డ్యాన్స్ బేస్డ్ సిరీస్ ల‌తో బాలీవుడ్ వేడెక్కిపోతోంది. ఇక శ్ర‌ద్ధా క‌పూర్ ఓవైపు ప్ర‌భాస్ స‌ర‌స‌న సాహో చిత్రంలో న‌టిస్తూనే, బాలీవుడ్ ప్రాజెక్టుల‌ను చ‌క్క‌బెట్టేస్తోంది.