Begin typing your search above and press return to search.

తెర మీదే కాదు స్టేజ్ మీద ఆడాల్సిందే..!

By:  Tupaki Desk   |   30 Oct 2022 3:48 AM GMT
తెర మీదే కాదు స్టేజ్ మీద ఆడాల్సిందే..!
X
ఈమధ్య సినిమాని ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తేనే కానీ అది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా లేదు. స్టార్ సినిమానే కాదు చిన్న బడ్జెట్ తో చేసే స్మాల్ హీరో సినిమాలకు కూడా ఇదే విధంగా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ప్రచార చిత్రాలు ఓ పక్క.. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఒక పక్క వీటితో పాటుగా ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని అలరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా సంతోశ్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్. నవంబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరిగింది.

ఈ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయనతో పాటు మారుతి కూడా ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో భాగంగా ఆ స్టేజ్ మీదే హీరో సంతోశ్ శోభన్ హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా డ్యాన్స్ చేశారు. ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్క్ అవుట్ అయ్యింది అన్నది స్టేజ్ మీద డ్యాన్స్ వేసినప్పుడే అర్ధమైంది. సినిమాని ఎలాగైనా సరే ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో యువ టీం అంతా ఇలా ప్లాన్ చేశారు. సినిమాలో పాటలకు మెడ్లీగా ట్రై చేశారు. సంతోశ్ శోభన్ కి ఏమాత్రం తగ్గకుండా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్ధుల్లా కూడా అదరగొట్టింది.

కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న లైఫ్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా ప్రేక్షకులను పక్కా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. మేర్లపాక గాంధి మాస్ట్రో తర్వాత తీసిన సినిమా ఇది. అతను తీసిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా మార్క్ కామెడీ ఈ సినిమాలో కనిపిస్తుంది. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ప్రతి యూట్యూబ్ ఛానెల్ వారు చెప్పే డైలాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మరి అదే టైటిల్ గా పెట్టుకుని చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో హీరోయిన్ స్టేజ్ మీద డ్యాన్స్ వేయడమే ఈవెంట్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో బ్రహ్మాజి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తుంది. నవంబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అనది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.