Begin typing your search above and press return to search.

పిక్ టాక్: సూపర్ కూల్ లెజెండ్ తో 'లైగర్' టీమ్..!

By:  Tupaki Desk   |   17 Nov 2021 6:28 AM GMT
పిక్ టాక్: సూపర్ కూల్ లెజెండ్ తో లైగర్ టీమ్..!
X
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ''లైగర్''. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇందులో బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ - టైసన్ లపై షూట్ చేయాల్సిన సన్నివేశాల కోసం ఇటీవలే అమెరికా వెళ్లిన చిత్ర బృందం.. మంగళవారం యూఎస్ఏ షెడ్యూల్ ను ప్రారంభించింది.

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ‘లైగర్’ సెట్ లో అడుగుపెట్టారు. స్టంట్ డైరెక్టర్ కెచ్చా నేతృత్వంలో విజయ్ దేవరకొండ - టైసన్ పై కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. లెజెండరీ బాక్సర్ తో మొదటి రోజు లైగర్ షూట్ ఒక మరపురాని అనుభూతి అని చిత్ర బృందం చెబుతోంది.

సెట్ లో టైసన్ చాలా స్వేచ్ఛగా స్నేహపూర్వకంగా ఉంటున్నారట. చాలా సరదాగా ఉంటున్న టైసన్ ని.. అతని సింప్లిసిటీని చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారని తెలుస్తోంది.

మైక్ టైసన్ తో ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత 'లైగర్' చిత్ర యూనిట్ ఆయనతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. సూపర్ కూల్ లెజెండ్ సెట్ లో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారనే విషయాన్ని ఈ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. విజయ్ దేవరకొండ - హీరోయిన్ అనన్య పాండే - పూరీ జగన్నాధ్ మరియు ఛార్మీలతో టైసన్ దిగిన ఓ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది.

అలానే హోలీఫీల్డ్ చెవి కొరికి సస్పెండ్ అయిన దానికి గుర్తుగా అనన్య పాండే చెవిని టైసన్ కోరుకుతున్నట్లు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవన్నీ టైసన్ తో సహా ప్రతి ఒక్కరి మధ్య కెమిస్ట్రీని తెలియజేస్తోంది. మరి లైగర్ - లెజెండరీ బాక్సర్ ఇద్దరూ వెండితెర మీద ఏ స్థాయిలో అగ్గి రాజేస్తారో చూడాలి.

కాగా, 'లైగర్' విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. పూరి కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్ -కరణ్ జోహార్ - అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో రమ్యకృష్ణ - రోనిత్ రాయ్ - విష్ణు రెడ్డి - అలీ - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని 2022 ప్రథమార్థంలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.