Begin typing your search above and press return to search.

ప్ర‌మోష‌న్స్ కోసం అంద‌రిని వాడేస్తున్న లైగ‌ర్‌!

By:  Tupaki Desk   |   24 Aug 2022 3:30 PM GMT
ప్ర‌మోష‌న్స్ కోసం అంద‌రిని వాడేస్తున్న లైగ‌ర్‌!
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `లైగ‌ర్‌` మ‌రి కొన్ని గంట‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ బ‌జ్ క్రియేట్ అయింది. బాలీవుడ్ మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ మూవీకి బాలీవుడ్ లోనూ భారీ ఓపెనింగ్స్ ల‌భించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి ఛార్మీ, పూరి జ‌గ‌న్నాథ్ ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

ఆగ‌స్టు 25న విడుద‌ల‌వుతున్న ఈ మూవీకి #BoycottLigerMovie పెద్ద త‌ల‌నొప్పిగా మారిన విష‌యం తెలిసిందే. అయితే బాలీవుడ్ హీరోల్లా కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ అండ్ `లైగ‌ర్` టీమ్ #BoycottLigerMovie ట్రెండ్ ని కూడా థీటుగా ఎదుర్కొని దాన్నే త‌మ సినిమా ప‌బ్లిసిటీకి ప్ర‌ధాన ఆయుధంగా మార్చుకుని షాకిచ్చింది. ఎప్పుడైతే #BoycottLigerMovie హ్యాట్ టాగ్ నెట్టింట ట్రెండ్ కావ‌డం మొద‌లైందో అప్పుడే `లైగ‌ర్‌` టీమ్ రంగంలోకి దిగింది.

ఈ మూవీపై నెగెటివిటీ క్రియేట్ అయ్యే లోపే #UnstoppableLIGER, #iSupportLIGER హ్యాష్ ట్యాగ్ ల‌ను నెట్టింట ట్రెండ్ చేయ‌డం మొద‌లు పెట్టింది. అంతే కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా దీనిపై ఘాటుగా స్పందించి ఎవ్వ‌డు ఎన్ని అడ్డంకులు సృష్టించిన వెన‌క్కి త‌గ్గేది లేదంటూ గట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో అత‌ని అభిమానులు భారీ స్థాయిలో #BoycottLigerMovie హ్యాష్ టాగ్ కు ధీటుగా #UnstoppableLIGER, #iSupportLIGER హ్యాష్ ట్యాగ్ ల‌తో ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఇంత‌టితో ఆగ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని `లైగ‌ర్‌`కు అనుకూలంగా మ‌లుచుకుంటూ వ‌చ్చాడు. `ఖుషీ` టైటిల్ గురించి.. సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ ప‌వ‌న్ ఫ్యాన్స్ ని ప్ర‌స‌న్నం చేసుకున్నాడు. ఆ త‌రువాత `RRR` గురించి మాట్లాడుతూ ఈ మూవీతో రామ్ చ‌ర‌ణ్ అన్న‌, ఎన్టీఆర్ అన్న ఆస్కార్ కు నామినేట్ కావ‌డం గ్యారెంటీ అంటూ ఇద్ద‌రి ఫ్యాన్స్ లో మార్కులు కొట్టేశాడు. అంతేనా అల్లు అర్జున్ గురించి నైస్ గా మాట్లాడి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కూడా త‌న వైపు తిప్పుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌.. ఇలా ఎవ‌రు త‌న‌కు అనుకూలంగా మాట్లాడినా దాన్ని చ‌క్క‌గా `లైగ‌ర్‌`కి ప్లాస్ అయ్యేలా చేసుకుని త‌న టాలెంట్ ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు. `అర్జున్ రెడ్డి` స‌మ‌యంలోనూ ఇదే పంథాను అనుస‌రించి వివాదాల‌ని సైతం త‌న సినిమాకు అప్ప‌ట్లోనే అనుకూలంగా మార్చుకుని ఔరా అనిపించిన విష‌యం తెలిసిందే.