Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : లైగర్
By: Tupaki Desk | 25 Aug 2022 8:46 PM ISTచిత్రం : లైగర్
నటీనటులు: విజయ్ దేవరకొండ-అనన్య పాండే-రమ్యకృష్ణ-మైక్ టైసన్-విషు రెడ్డి-రోనిత్ రాయ్ తదితరులు
సంగీతం: విక్రమ్ మొంత్రోస్-తనీష్క్ బాగ్చి-లియో జార్జ్-డీజే చీతాస్-సునీల్ కశ్యప్-జాని
నేపథ్య సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: విష్ణుశర్మ
నిర్మాతలు: ఛార్మి కౌర్-కరణ్ జోహార్-అపూర్వ మెహతా-హిరు యశ్ జోహార్
రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్
సంచలన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే రేకెత్తించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
లైగర్ (విజయ్ దేవరకొండ) తండ్రి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో తలపడుతూ ప్రాణాలు వదలడంతో అతను సాధించలేకపోయిన దాన్ని కొడుకుతో సాధింపజేయాలన్న లక్ష్యంతో అతణ్ని తీసుకుని ముంబయికి వస్తుంది తల్లి (రమ్యకృష్ణ). చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కొడుకు సామర్థ్యం గురించి చెప్పి ఒక కోచ్ (రోనిత్ రాయ్) దగ్గర చేరుస్తుంది. అతడి శిక్షణలో రాటుదేలుతున్న క్రమంలోనే తానియా (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు లైగర్. కానీ అతడికి నత్తి ఉందని ఆలస్యం తెలుసుకున్న ఆమె.. తనను విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఆమె మీద కసితో రింగులో రెచ్చిపోయిన లైగర్ జాతీయ ఛాంపియన్ గా నిలుస్తాడు. ఆ తర్వాత అంతర్జాతీయ పోటీల్లోనూ తలపడాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మరి వాటిని దాటుకుని అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
బాక్సింగ్.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మనకు సినిమాలు కొత్తేమీ కాదు. తెలుగులో 'తమ్ముడు'.. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'.. హిందీలో 'సుల్తాన్'.. తమిళంలో 'గురు'.. ఇలా సూపర్ హిట్టయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఐతే ఈ సినిమాలను విజయవంతం చేసింది.. జనాలు ఉర్రూతలూగిపోయేలా చేసింది అందులోని 'ఫైట్' మాత్రమే అనుకుంటే పొరబాటే. హీరో/హీరోయిన్ రింగులో దిగడానికి ముందే వాళ్లు ప్రేక్షకుల మనసులు గెలిచేస్తారు. వాళ్ల బ్యాక్ స్టోరీ.. అందులోని ఎమోషన్ హృదయానికి హత్తుకుంటుంది. ఆ ఎమోషనే సినిమాను నడిపిస్తుంది. ముందు తమ వ్యక్తిగత జీవితం తాలూకు సంఘర్షణను.. బాధను.. భావోద్వేగాలను మన మనసుల్లోకి బలంగా ఎక్కించి.. ఆ తర్వాత ప్రధాన పాత్రధారి రింగులో దిగి చెలరేగుతుంటే.. వచ్చే 'కిక్కు' వేరుగా ఉంటుంది. 'లైగర్'కు ఆ కిక్కే మిస్ అయింది. బలమైన ఎమోషన్ అంటూ ఏదీ లేకపోవడం.. పరమ రొటీన్ కథ 'లైగర్'ను నీరుగార్చేయగా.. కనీసం పూరి మార్కు హీరో క్యారెక్టర్ కూడా మిస్ అవడంతో 'లైగర్' పంచ్ కాస్తా ప్రేక్షకులకే గట్టిగా తాకింది. తన మీద మోయలేనంత భారం పెట్టేయడంతో విజయ్ దేవరకొండ సైతం 'లైగర్'ను కాపాడలేకపోయాడు.
'లైగర్' ప్రోమోలు చూసి చాలామందికి పూరి జగన్నాథ్ తీసిన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమా గుర్తుకు వచ్చింది. ఐతే ఆ చిత్రానికి, దీనికి అసలు పోలిక లేదని నొక్కి వక్కాణించాడు పూరి. కానీ తన బ్లాక్ బస్టర్ మూవీకి పూరి ఇంకో వెర్షన్ తీయడానికి ప్రయత్నించినట్లే అనిపిస్తుంది. కాకపోతే దానికి ఇదొక పేలవమైన అనుకరణలా అనిపిస్తుంది తప్ప ఏ దశలోనూ ఇది ఎంగేజ్ చేయలేదు. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'లో మదర్ సెంటిమెంట్ మనసుల్ని పిండేస్తే.. ఇక్కడ ఆ ట్రాక్ చికాకు పెడుతుంది. హీరోయిన్ ట్రాక్ అక్కడ గిలిగింతలు పెడితే.. ఇక్కడ ఆ ట్రాక్ శిరోభారంగా మారుతుంది. హీరో తండ్రి రింగులో ప్రాణాలు వదిలాడంటూ తల్లితో రెండు ముక్కలు చెప్పించారే తప్ప.. దాంతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయలేదు. ఇక లవ్ స్టోరీ అనే ప్రహసనం గురించి ఏం చెప్పాలి? తొలి సన్నివేశంలోనే హీరోను చూసి అసహ్యించుకునే హీరోయిన్.. తర్వాత అతను బాగా ఫైట్ చేస్తున్నాడని ప్రేమలో పడిపోతుంది. తర్వాతేమో అతడికి నత్తి అని చెప్పి వదిలేసి వెళ్లిపోతుంది. అతను విజేతగా నిలిచాక తనలో కసి పెంచడానికే ఆమె దూరం అయినట్లు నాట్ నాట్ సెంచరీ డైలాగులు చెప్పిస్తారు. ఇలా ఇటు కుటుంబ నేపథ్యం పరంగా కానీ.. అటు ప్రేమ కథతో కానీ 'లైగర్' ప్రేక్షకులను కదిలించలేకపోయింది. దీంతో హీరో రింగులోకి దిగడానికి ముందు ప్రేక్షకుల్లో కనీస స్థాయిలో కూడా ఎమోషన్ అన్నది కనిపించదు. ఇక అతను ప్రత్యర్థుల మీద ఎంత చెలరేగిపోతున్నా.. ఎంత కసి చూపిస్తున్నా 'ఎలివేషన్'కు స్కోపే లేకపోయింది.
'లైగర్' కాస్తో కూస్తో పర్వాలేదనిపించేది ప్రథమార్ధంలోనే. అందులోనూ దర్శకుడు పూరి జగన్నాథ్ మార్కంటూ ఏమీ కనిపించదు. విజయ్ దేవరకొండ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్.. నటనతో ప్రేక్షకుల్లో సినిమా మీద కొంచెం ఆసక్తి రేకెత్తిస్తాడు. చక్కగా డిజైన్ చేసిన ఫైట్లు.. హీరో 'నత్తి' సమస్య చుట్టూ నడిపిన కొన్ని సీన్లు ఓకే అనిపించి 'లైగర్' ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తున్న సమయంలో.. హీరోయిన్ రంగ ప్రవేశం చేసి ప్రేక్షకులను చికాకు పెట్టడం మొదలవుతుంది. హీరోయిన్ హీరోను ప్రేమించడానికి ఏ కారణం కనిపించదు. హీరో ఆమె పట్ల ఆకర్షితుడంలో ఏ లాజిక్ లేదు. ఏదో ప్రేమకథ పెట్టాలి కాబట్టి దాన్ని బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుందే తప్ప దాని వల్ల ఏ ప్రయోజనం లేకపోయింది. హీరో 'నత్తి'ని సమస్యగా చూపించి కథను మలుపు తిప్పాలని.. డ్రామాను పండించాలని చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టేసింది.
ప్రథమార్ధం వరకు సోసోగా అనిపించే 'లైగర్' ద్వితీయార్ధంలో మెరుగుపడుతుందేమో అనుకుంటే.. పూర్తిగా ట్రాక్ తప్పేసింది. ఎంఎంఏ ఫైట్లను యాక్షన్ కొరియోగ్రాఫర్ బాగానే డిజైన్ చేసినా.. విజయ్ అదిరిపోయే మేకోవర్ తో నిజమైన ఫైటర్ లాగా కనిపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా.. ఎమోషనల్ కనెక్ట్ అంటూ ఏమీ లేకపోవడం వల్ల ఈ ఫైట్ల వ్యవహారం అంతా ఫ్లాట్ గా సాగిపోతుంది. అతను ఈజీగా నేషనల్ ఛాంపియన్ అయిపోతాడు. తర్వాత ఇంటర్నేషనల్ ఫైట్ అంటాడు. అక్కడ కూడా అంతా మామూలే. హీరోకు ఎదురయ్యే ఆర్థిక సమస్యలు.. అవి పరిష్కారం అయ్యే తీరు.. హీరోయిన్ రీఎంట్రీ.. ఇదంతా ఒక తలపోటు వ్యవహారంలా తయారవుతుంది. చివర్లో పెద్ద బిల్డప్ మధ్య మైక్ టైసన్ ను రంగంలోకి దించి థ్రిల్ చేయాలని చూశారు కానీ.. ఆ ఎపిసోడ్ చాలా సిల్లీగా తయారై 'లైగర్' మీద పూర్తిగా ఇంప్రెషన్ పోగొట్టేసింది. ఈ తంతు మొత్తం అయ్యాక కూడా ఇంకేదో జరగబోతున్నట్లు భ్రమ కల్పించి 'కోకా కోకా' పాట పెట్టడం.. వెంటనే రోలింగ్ టైటిల్స్ పడడం పెద్ద జోక్. ఊరికే అరుపులు.. కేకలు.. పాత్రల అతి నటన.. ఓవర్ ద టాప్ సీన్లు.. అవసరం లేని హడావుడి తప్పితే.. 'లైగర్'లో ఎక్కడా విషయం అన్నది లేకపోయింది.
నటీనటులు:
'లైగర్' పాత్ర కోసం విజయ్ పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇండియన్ సినిమాలో ఇలాంటి ఫైటర్ పాత్రలు పోషించిన అందరిలోకి 'ది బెస్ట్' అనిపించే స్థాయిలో అతను మేకోవర్ అయ్యాడు. రింగులో అతను చెలరేగుతుంటే నిజమైన ఫైటర్ని చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు. తన బాడీ లాంగ్వేజ్.. స్క్రీన్ ప్రెజెన్స్.. నటన చాలా బాగున్నాయి. కానీ తనను సరిగా ఉపయోగించుకోవడంలో పూరి జగన్నాథ్ విఫలమయ్యాడు. కథ సంగతలా ఉంచితే.. పూరి మార్కు హీరో క్యారెక్టర్ పడ్డా 'లైగర్'ను విజయ్ వేరే లెవెల్లో నిలబెట్టేవాడు. కానీ ఈ విషయంలో నిరాశ తప్పదు. హీరోయిన్ అనన్య పాండే స్క్రీన్ మీద కనిపించినపుడల్లా ఎప్పుడెప్పుడు ఆమె పక్కకు వెళ్లిపోతుందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. తన పాత్ర.. నటన అంతగా చికాకు పెట్టిస్తాయి. రమ్యకృష్ణకు కూడా తన స్థాయికి తగ్గ పాత్ర పడలేదు. ఆమె ఊరికే అరవడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. మైక్ టైసన్ పాత్ర చాలా కామెడీగా అనిపించి ప్రేక్షకులు వెర్రి నవ్వులు నవ్వుకునేలా చేస్తుంది. హీరో ప్రత్యర్థిగా విషు రెడ్డి.. కోచ్ గా రోనిత్ రాయ్ ఓకే అనిపించారు. ఆలీ.. గెటప్ శీను కొంత నవ్వించారు. చుంకీ పాండే గురించి చెప్పడానికేమీ లేదు.
సాంకేతిక వర్గం:
'లైగర్' సంగీతం కోసం అరడజను మంది సంగీత దర్శకులు పని చేశారు. సినిమా శైలికి తగ్గట్లే వాళ్లు అందించిన పాటలు మరీ లౌడ్ గా అనిపిస్తాయి. వాట్ లగా దేంగే మినహాయిస్తే ఏ పాటకూ సరిగా టైమింగ్ కుదరలేదు. పాటలైతే సినిమాకు ప్లస్ అనిపించవు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం కొంచెం డిఫరెంటుగా ట్రై చేశాడు. కొన్ని చోట్ల సన్నివేశాలను ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్లా తేడా కొట్టినట్లు అనిపిస్తుంది. విష్ణు శర్మ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఓకే. సినిమా రిచ్ గానే అనిపిస్తుంది. లైవ్ వైర్ లాంటి హీరో.. మిగతా వనరులు అన్నీ బాగా కుదిరినప్పటికీ.. రైటర్ కమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉపయోగించుకోలేకపోయాడు. ఏమాత్రం కొత్తదనం లేని ఈ కథతో ఇంత భారీ సినిమా తీయాలని ఆయన ఎలా తలపోశాడు.. విజయ్ ఆయన్ని ఎలా నమ్మేశాడు అన్నది అర్థం కాని విషయం. కథన పరంగా కూడా మెరుపులు కరవయ్యాయి. హీరోల క్యారెక్టరైజేషన్ మీద సినిమాను ముందుకు నడిపించే నైపుణ్యం కూడా పూరిలో కొరవడింది. దీంతో 'లైగర్' ఆయన వీకెస్ట్ మూవీస్ లో ఒకటిగా మిగిలిపోయింది.
చివరగా: లైగర్.. రివర్స్ పంచ్
రేటింగ్-2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre