Begin typing your search above and press return to search.

'లైగర్‌' చివరి పోరాటం బ్యాలన్స్‌

By:  Tupaki Desk   |   12 July 2021 8:20 AM GMT
లైగర్‌ చివరి పోరాటం బ్యాలన్స్‌
X
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లైగర్‌. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. కాని కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తోంది. కరోనా మొదటి వేవ్‌ తర్వాత సినిమాను పునః ప్రారంభించి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ విడుదల తేదీ మార్చాల్సి వస్తుంది. షూటింగ్‌ ఇంకా బ్యాలన్స్ ఉంది. కనుక యూనిట్‌ సభ్యులు ప్రకటించినట్లుగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న విడుదల సాధ్యం కాదని అంటున్నారు. పైగా అప్పటి వరకు థియేటర్లు పూర్తి స్థాయిలో రన్‌ అవుతాయా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.

లైగర్‌ సినిమా లో విజయ్‌ దేవరకొండ లుక్‌ తో పాటు పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. సినిమా కథ నచ్చడంతో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. బాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ విషయానికి వస్తే ఇప్పటికే మెజార్టీ టాకీ పార్ట్‌ పూర్తి అయ్యిందని.. త్వరలోనే బ్యాలన్స్‌ వర్క్‌ పూర్తి చేస్తామని చెబుతున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసినా వెంటనే విడుదల చేసేది అనుమానమే అన్నట్లుగా ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాలోని ఒక భారీ యాక్షన్‌ సన్నివేశంతో పాటు క్లైమాక్స్ సన్నివేశం ఇంకా పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొత్తం సినిమాను సింగిల్ షెడ్యూల్‌ లో పూర్తి చేసేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నాడట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టులో సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టి సినిమా ను దసరా లేదా దీపావళికి విడుదల చేసేలా ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. షూటింగ్‌ వెంటనే మొదలు పెట్టి పూర్తి చేస్తే ముందుగా చెప్పినట్లుగా సెప్టెంబర్‌ 9న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాని యూనిట్‌ సభ్యులు సెప్టెంబర్‌ లో విడుదలకు సిద్దంగా ఉన్నారా అనేది చూడాలి.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా తో విజయ్ దేవరకొండ పాన్‌ ఇండియా స్టార్‌ గా మారడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా కోసం గత ఏడాదిన్నర కాలంగా విజయ్‌ దేవరకొండ జుట్టు పెంచుకునే ఉన్నాడు. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌ లుక్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. రౌడీ స్టార్‌ కు ఇప్పటికే బాలీవుడ్‌ లో క్రేజ్ ఉంది. కనుక ఈ సినిమాతో ఆయన మరింతగా అక్కడి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేస్తాడని అంటున్నారు. ఈ సినిమా కు ముందు పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా ను తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా చూస్తున్నారు.

ఛార్మి మరియు పూరిలతో కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా లో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. లైగర్ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ సినిమా కు శివ నిర్వాన దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వం లో రౌడీ స్టార్‌ సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి రౌడీ స్టార్‌ వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమా లతో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నాడు.