Begin typing your search above and press return to search.

'లైగర్‌' ఫస్ట్‌ పంచ్ సూపర్ హిట్‌

By:  Tupaki Desk   |   1 Jan 2022 4:30 PM GMT
లైగర్‌ ఫస్ట్‌ పంచ్ సూపర్ హిట్‌
X
రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ.. పూరి జగన్నాద్‌ ల కాంబినేషన్ లో రూపొందుతున్న లైగర్‌ సినిమా నుండి కొత్త సంవత్సరం కానుకగా గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఈ సినిమా కు మొదటి నుండి పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. కరణ్‌ జోహార్‌ ఈ సినిమా ను హిందీలో విడుదల చేయబోతుండటంతో పాటు ఆయన ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాధ్ కు ఇప్పటికే ఉత్తరాదిన మంచి క్రేజ్ ఉంది. కనుక లైగర్‌ సినిమా కోసం ఉత్తరాది సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తాజాగా విడుదల అయిన గ్లిమ్స్ కు వచ్చిన రెస్పాన్స్ తో క్లారిటీ వచ్చింది.

విజయ్ దేవరకొండ లుక్ మరియు సినిమా స్టోరీ లైన్ ను క్లుప్తంగా వివరించిన ఈ గ్లిమ్స్ కు 24 గంటల్లో ఏకంగా 15.92 మిలియన్ ల వ్యూస్‌ ను దక్కించుకుంది. ఈమద్య కాలంలో వచ్చిన సినిమాల గ్లిమ్స్ కు ఈ స్థాయి వ్యూస్ దక్కిందే లేదు. ఇండియన్ సినిమాల గ్లిమ్స్ కు మొదటి 24 గంటల్లో ఈ స్థాయి వ్యూస్ రావడం ఇదే ప్రథమం. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న లైగర్ గ్లిమ్స్ రెండవ రోజు కూడా అదే దూకుడుతో దూసుకు పోతుంది. అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ ల వ్యూస్‌ వరకు ఈ సినిమా గ్లిమ్స్ రాబట్టుకుంటుందనే నమ్మకంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ ఇప్పటి వరకు హిందీలో పెద్దగా సక్సెస్‌ కాకున్నా కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. కనుక లైగర్‌ కు ఆ క్రేజ్ కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. వీరిద్దరి కాంబోలో వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తో విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా స్టార్‌ గా కచ్చితంగా గుర్తింపు దక్కించుకుంటాడని అభిమానులు ధీమాతో ఉన్నారు. విజయ్‌ దేవరకొండ లైగర్ సినిమా కోసం బాక్సర్‌ గా మారాడు.

ఒక చాయ్‌ వాలా అంతర్జాతీయ స్థాయి బాక్సర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. లైగర్ సినిమా నుండి వచ్చిన ఫస్ట్‌ గ్లిమ్స్ తోనే అంచనాలు పీక్స్ కు చేరాయి. కనుక ముందు ముందు రాబోతున్న టీజర్.. ట్రైలర్‌ లు మరో లెవల్‌ లో ఉంటాయేమో చూడాలి. ఈ సినిమా ను ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సమయం ఇంకా చాలా ఉంది కనుక మెల్లగా షూట్‌ ను ముగిస్తారేమో చూడాలి.