Begin typing your search above and press return to search.

న‌లుగురితో 'లైగ‌ర్' బ్యూటీ రిలేష‌న్ షిప్..?!

By:  Tupaki Desk   |   29 July 2022 2:53 PM GMT
న‌లుగురితో లైగ‌ర్ బ్యూటీ రిలేష‌న్ షిప్..?!
X
ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా న‌లుగురు హీరోల‌తో లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే డేటింగ్ చేసింద‌ట‌. కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7లో ఇలాంటి సంచ‌ల‌న ప్ర‌శ్న‌ల‌తో వేడెక్కించాడు క‌ర‌ణ్‌. ముఖ్యంగా యువ‌క‌థానాయిక‌ల డేటింగ్ ర‌హ‌స్యాల‌ను అత‌డు బ‌య‌ట‌పెడుతున్నాడు. స‌ద‌రు నాయిక‌లు చెప్పేందుకు మొహ‌మాట ప‌డుతూనే కొన్నిటిని అంగీక‌రిస్తున్నారు.

కాఫీ విత్ కరణ్ 7 లో అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండతో డేటింగ్ కు వెళ్లారా? అన్న ప్ర‌శ్న ఎదురైంది. ఈ షోలో అనన్య పాండే - విజయ్ దేవరకొండ తమ డేటింగ్ జీవితాలపై ఓపెన‌య్యారు. ఈ జంట‌ లైగ‌ర్ షూటింగ్ సమయంలో డేట్ కి వెళ్లి ఆనందించిన తేదీ గురించి కూడా వెల్లడించారు.

ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ పోర్టల్స్ ద్వారా వచ్చిన పుకార్ల ప్రకారం అనన్య - ఇషాన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని చాలా స్పష్టంగా తెలిసింది. ఖాలీ పీలీ షూటింగ్ స‌మ‌యంలో ఈ జంట షికార్లు పుకార్ల‌కు దారి తీసాయి. అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయారు. కాబట్టి లైగర్ షూటింగ్ సమయంలో విజయ్ - అనన్య డిన్నర్ డేట్ కి వెళ్లారు. అనన్య ఇషాన్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు ఈ తేదీ (చూపిస్తూ) వచ్చిందా? అని కరణ్ జోహార్ అడిగినప్పుడు అన‌న్య‌ దీనిని ఫ్రెండ్లీ డేట్ గా అభివర్ణించింది. వాస్తవానికి విజయ్ డేటింగ్ కి వెళ్ల‌డానికి ఇద్దరూ చక్కగా దుస్తులు ధరించామ‌ని తెలిపాడు. ఇంకా చెప్పాల‌ని చూసినా అన‌న్య ఖండించింది.

అనన్య - కార్తీక్ ఆర్యన్ మధ్య ఏం జరుగుతోంది?

క‌ర‌ణ్ షోలో కార్తీక్ ఆర్యన్ ప్రస్తావన కూడా వచ్చింది. కార్తీక్ తో కూడా సంబంధం ఉందా? అని అన‌న్య‌ను క‌ర‌ణ్‌ అడిగాడు. దీనిపై య‌థావిధిగానే తను మంచి స్నేహితుడు మాత్రమేనని అన‌న్య‌ పేర్కొంది. KJo సరదాగా మాట్లాడేస్తూ..కార్తీక్ ఇతర భామ‌లతో మంచి స్నేహితుడు అన్న‌ ట్యాగ్ ను పొంద‌లేదు అని కూడా పేర్కొన్నాడు. కేవ‌లం అన‌న్య‌కు మాత్ర‌మే అత‌డు స్నేహితుడు అని అర్థం వ‌చ్చేలా మాట్లాడాడు.

ఆదిత్య రాయ్ కపూర్ తోనూ..

అనన్య - ఆదిత్య రాయ్ కపూర్ జంటపై ఇటీవల వచ్చిన పుకార్లపై కరణ్ జోహార్ ప్ర‌శ్నించాడు. ఆదిత్య రాయ్ కపూర్- అనన్య పాండే టైటానిక్ త‌ర‌హాలో స్పిన్నింగ్ తో కూడిన స్టీమీ డ్యాన్స్ పార్టీ గురించి అతను ప్రస్తావించాడు. ఆదిత్య రాయ్ కపూర్ ని తాను చాలా హాట్ బోయ్ గా చూస్తానని అన‌న్య అంది. అయితే భవిష్యత్తులో అతనితో డేటింగ్ చేస్తారా? అని అడిగినప్పుడు.. కల్ హో నా హో అని చెప్పింది.

అన‌న్య క్లాస్ మేట్ తో రొమాన్స్ గురించి కూడా ప్ర‌శ్నించారు క‌ర‌ణ్. మొత్తానికి షో ఆద్యంతం ఎఫైర్ క‌హానీల‌పై క‌ర‌ణ్ గ‌మ్మ‌త్త‌యిన ప్ర‌శ్న‌లు అడిగారు. వాటికి అంతే గ‌మ్మ‌త్తైన జ‌వాబుల‌ను ఇచ్చింది క్యూట్ బ్యూటీ. లైగ‌ర్ లో విజ‌య్ తో అన‌న్య కెమిస్ట్రీ ఓ రేంజులో వ‌ర్క‌వుట్ కానుంది. ఆగ‌స్టులో ఈ మూవీ విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి దేవ‌ర‌కొండ‌.. అన‌న్య కెరీర్ ప‌రంగా చాలా బిజీగా ఉన్నారు.