Begin typing your search above and press return to search.
తమిళంలో పాడటమా! విస్మయంతో స్వరం పెంచిన చిన్మయి!!
By: Tupaki Desk | 12 Dec 2020 3:59 PM ISTత్రిష మాస్ మహరాణి అవతారం ఎత్తి విలన్లను వెంబడిస్తూ చితక్కొట్టే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హెవీ డ్యూటీ యాక్షన్ .. ఛేజ్ లు.. శత్రువులను చితక్కొట్టి.. వారి నుంచి డబ్బు గుంజేందుకు పరుగులెత్తిస్తూ టీజర్ తోనే దుమారం రేపింది త్రిష. ఇంతకీ ఇది ఏ సినిమా అంటే టైటిల్ కూడా అంతే మాసీగా దూసుకొచ్చింది. `రాంగి` అనేది టైటిల్. ఈ సినిమాకి జాతీయ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్.మురుగదాస్ కథను అందించగా శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇంతకుముందు రిలీజైన టీజర్ బంపర్ హిట్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో త్రిషను పోలీసులు అరెస్టు చేసిన లుక్ ఆసక్తిని పెంచింది. ఆడాళ్ల గుండెల్లో మెదిలే చాలా ప్రశ్నలకు రాంగి వద్ద సమాధానం ఉందని తెరపై చూపిస్తున్నారట. సి సత్య సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సుభాష్కరణ్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ మూవీ నుంచి తాజాగా తొలి సింగిల్ రిలీజ్ కానుందని గాయని చిన్మయి శ్రీపాద వెల్లడించారు. ఈ పాటను చిన్మయి ఆలపించారని అర్థమవుతోంది. సీనియర్ లిరిసిస్ట్ వైరముత్తుపై మీటూ ఆరోపణల అనంతరం చిన్మయికి అవకాశాలు తగ్గాయి. కానీ ఇటీవల నెమ్మదిగా తనకు పిలిచి అవకాశాలివ్వడం ఆసక్తికరం. ``రాంగిలో భాగమైనందుకు కృతజ్ఞతలు.. తమిళంలో పాడటం !!!!!!!!!`` అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది చిన్మయి. అద్భుతమైన సత్య సి సర్ స్వరపరిచారు. కబిలాన్ సర్ సాహిత్యం అందించారు... ! అంటూ తనకు అవకాశం దక్కిన వేళ చిన్మయి కాస్త గట్టిగానే స్వరం పెంచారు. కోలీవుడ్ లో ఇక చిన్మయికి అవకాశాలు రావు అనుకున్నవారికి ఇది గట్టి సమాధానమే.