Begin typing your search above and press return to search.
తన తల్లి పడిన బాధ మరెవరూ పడకూడదన్న హీరో
By: Tupaki Desk | 15 Feb 2021 11:00 AM ISTకష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ‘శక్తి’.. ఈ ప్రపంచంలో చాలా మందికి ఉంది. కానీ.. ఆదుకోవాలనే మనసు మాత్రం అతి కొద్ది మందికి ఉంది! అదేవిధంగా.. ఈ దేశంలో రీల్ హీరోస్ చాలా మందే ఉన్నారు. కానీ.. రియల్ హీరోస్ మాత్రం అతి స్వల్పంగా ఉన్నారు. వీరు తెరపై మాత్రమే కాదు.. తెర వెనుక కూడా బాధితుల పక్షాన నిలుస్తారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే వారికి.. నేనున్నా అంటూ చేయి అందిస్తారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్.
కేన్సర్ బారిన పడి, ప్రాణాలతో పోరాడుతూ.. ఇటు ఆరోగ్య పరంగా, అటు ఆర్థికంగా చితికిపోతున్న అభాగ్యులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు అర్జున్ కపూర్. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా.. కేన్సర్ బారిన పడ్డ 100 మంది దంపతులకు సాయం చేస్తున్నట్టు ప్రకటించారు అర్జున్. ఇందులో భాగంగా.. కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ (సీపీఏఏ) బృందంతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు.
భార్యాభర్తలలో ఒకరు క్యాన్సర్ బారిన పడితే.. రెండోవారు అన్ని విధాలుగా ఎదుర్కొనే ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఒక పక్క కేన్సర్‌తో బాధపడుతూ ఉంటే మరోపక్క కోవిడ్–19తో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం తిండికి కూడా డబ్బులు లేక అవస్థలు పడిన వారు ఎందరో. వీరందరిని ఆదుకోలేకపోయినా.. కొందరికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టానని అర్జున్ కపూర్ చెప్పారు.
‘‘ఒక్కో పేషెంట్‌కు కీమో, రేడియో థెరపీలు, ఆపరేషన్లు, మందుల కోసం సంవత్సరానికి లక్ష రూపాయల వరకు అవసరమవుతాయి. అందువల్ల.. కేన్సర్ బారిన పడ్డ జంటకు లక్షరూపాయల నగదు సాయం చేస్తా’’ అని చెప్పారు అర్జున్. అంతేకాదు.. కేన్సర్ బాధితులను ఆదుకునేందుకు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు కపూర్.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోన్న సమయంలో అందరం ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయాం. ఈ క్రమంలోనే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ అండగా నిలబడడం మొదలు పెట్టాం. నా ఆలోచన కూడా మారింది. వాలెంటైన్స్ డే వేళ నేను ఈ నిర్ణయంతీసుకున్నా’’ను అని చెప్పారు అర్జున్ కపూర్. కాగా.. అర్జున్ తల్లి కేన్సర్‌తోనే మరణించారు. తన తల్లి పడిన బాధ మరెవరూ పడకూడదన్న ఉద్దేశంతోనే.. క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు అర్జున్.