Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : చిరుత పిల్ల అదే కవ్వింత

By:  Tupaki Desk   |   5 July 2021 5:30 AM GMT
ఫొటోటాక్ : చిరుత పిల్ల అదే కవ్వింత
X
రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన చిత్రం చిరుత. పూరి జగన్నాద్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమా తో హీరోయిన్‌ గా నేహా శర్మ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దర్శకుడు పూరి ఈమెను ఆ సినిమాలో పొగరుబోతు అమ్మాయి పాత్రలో చూపించాడు. ఫారిన్ రిటర్న్‌ అమ్మాయిగా ఆ అమ్మాయి యాస.. బాడీ లాంగ్వేజ్ పాత్రకు సరిపోయేలా ఉన్నాయంటూ అంతా మెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. కాని ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. ఒక వైపు చరణ్ స్టార్‌ గా సూపర్‌ స్టార్‌ గా దూసుకు పోతూ ఉంటే మరో వైపు ఆమె మాత్రం ఫేడ్ ఔట్ అవుతూ వచ్చింది. అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇన్ స్టా గ్రామ్‌ లో ఏకంగా 12 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు తన ఫొటోలతో ఎప్పటికప్పుడు అభిమానులను ఫాలోవర్స్‌ ను ఎంటర్‌ టైన చేస్తూనే ఉంటుంది. హీరోయిన్ గా మళ్లీ మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఇలాంటి హాట్ ఫొటో షూట్ లను ఇస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటో చూస్తుంటే చిరుత సినిమాలో ఎలా అయితే అందంతో కవ్వించిందో అలాగే ఇక్కడ కూడా అలాగే చూపులతో కవ్విస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

గత ఏడాది ఒక వెబ్‌ సిరీస్ మరియు పంజాబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిరుత పిల్ల హిందీలో రూపొందుతున్న ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీని చేస్తోంది. సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిందని.. పరిస్థితులు అనుకూలిస్తే వెంటనే విడుదల చేస్తామంటూ మేకర్స్ ఇటీవలే వెళ్లడించారు. మరి ఆ సినిమా తర్వాత అయినా ఈ అమ్మడికి మంచి సినిమాల్లో ఆఫర్లు వస్తాయా చూడాలి. ఈమె షేర్‌ చేస్తున్న ఫొటోలు ఈమెకు ఇంకా స్టార్స్‌ కు జోడీ గా నటించే అందం ఉందని చెప్పకనే చెబుతున్నాయి.