Begin typing your search above and press return to search.

​మోనాలీసాను మళ్ళీ వేస్తాను

By:  Tupaki Desk   |   14 Aug 2017 7:30 AM GMT
​మోనాలీసాను  మళ్ళీ వేస్తాను
X
హాలీవుడ్ సినిమాలు ఎక్కువ శాతం పుస్తకాల నుండి కానీ లేదా ఏదైనా రియల్ స్టోరీస్ ఆదారంగా కానీ నిర్మిస్తారు. అసలు జీవిత కథలును సినిమా కథకు తగట్లుగా మార్చిన ఘనత కూడా వాళ్ళకే దక్కుతుంది. ఈ మధ్యన వచ్చిన స్టీవ్ జాబ్స్ సినిమా కూడా ఆపిల్ సంస్థ మాజీ అధినేత స్టీవ్ జాబ్స్ పైన నిర్మించిందే. ఇప్పుడు మరో హాలీవుడ్ నటుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత లియోనార్డో డికాప్రియో ఒక ప్రముఖ చిత్రకారుడు జీవిత కథలో హీరోగా నటించబోతున్నాడు.

డికాప్రియో చేసిన చాలా పాత్రలు రియల్ లైఫ్ ఆదారంగా చేసినివే. అతని నటనతో ఆ పాత్రలకు కొత్త జీవం తీసుకువస్తాడు. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ జీవిత కథను ఇప్పుడు హాలీవుడ్ లో నిర్మించాలిని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో లియోనార్డో డావిన్సీ గా లియోనార్డో డికాప్రియో నటిస్తున్నాడు పైగా ఈ సినిమాకు నిర్మాత కూడా అతనే. ది రెవెనెంట్‌ హీరో డికాప్రియో ఈ సినిమా కన్నా ముందు చాలా నిజజీవిత పాత్రలు చేసిన ఇంత పాత కాలపు మనిషి పాత్రలో ఇంతవరకు నటించలేదు. ఈ సినిమాలో బాగా ముసలివాడుగా కనిపించనున్నాడుని చెబుతున్నారు. ‘ది రెవెనెంట్‌’లో కూడా ప్రముఖ అమెరికన్‌ ట్రేడర్‌ హ్యూగ్‌ గ్లాస్‌ పాత్రలో నటించాడు. డికాప్రియో రీల్‌ లైఫ్‌ పాత్రల్లో నటించిన సినిమాల్లో ఇది తొమ్మిదో చిత్రం కావడం ఇప్పుడు ఈ సినిమాకు కొత్త హంగు ఏర్పడింది.

డికాప్రియో ఈ సినిమాకు చేయడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది అని చెబుతున్నారు హాలీవుడ్ మీడియా వాళ్ళు. డికాప్రియో తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఇటలీలోని ఓ మ్యూజియంలో డావిన్సీ వేసిన ఓ చిత్రాన్ని చూస్తున్నప్పుడు ఆమెకి డికాప్రియో కడుపులో కదిలినట్లు అనిపించిందట. దాంతో నాకు మగపిల్లాడు పుడితే వాడికి లియోనార్డో డికాప్రియో అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది అని చెబుతున్నారు. ఇదే విషయం డికాప్రియో చెబుతూ ‘అవును ఈ కథ మా అమ్మ నాకు ఒకసారి చెప్పింది. అనుకోకుండా ఈ కథలో నేను నటించే అవకాశం వచ్చేసారికి వెంటనే ఒప్పుకున్నాను. మళ్ళీ మా సినిమా ద్వారా మోనాలీసా ను ఎలా వేశాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తాము’ అని చెబుతున్నాడు ఈ సినిమా హీరో మరియు నిర్మాత డికాప్రియో.​