Begin typing your search above and press return to search.

మందు కొట్టి.. ఆస్కార్ వదిలేసి వచ్చేశాడు

By:  Tupaki Desk   |   1 March 2016 1:23 PM GMT
మందు కొట్టి.. ఆస్కార్ వదిలేసి వచ్చేశాడు
X
రెండు దశాబ్దాలకు పైగా నిరీక్షణ తర్వాత అందుకున్న ఆస్కార్ అవార్డు.. మరి దాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలి? కానీ లియనార్డో డికాప్రియో మాత్రం ఆస్కార్ ప్రతిమను లైట్ తీసుకున్నాడు. అవార్డు అందుకున్న ఆనందంలో తన సన్నిహితులతో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్ లో పార్టీ చేసుకున్న డికాప్రియో.. ఫుల్లుగా మందుకొట్టి అక్కడే తన ఆస్కార్ అవార్డు ప్రతిమను వదిలేసి వచ్చేశాడట. చివరికి ఆ రెస్టారెంట్ సిబ్బంది ఆ ప్రతిమను పట్టుకొచ్చి డికాప్రియోకు అందజేశారట. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన అవార్డుల కార్యక్రమంలో ‘ది రెవనెంట్’ చిత్రానికి గానూ డికాప్రియో ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలసిందే.

ఇంతకుముందు ఐదుసార్లు నామినేషన్లు దక్కించుకున్నా అవార్డు దక్కించుకోలేకపోయిన డికాప్రియో.. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకపోయింది. డికాప్రియో కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. అవార్డుల వేడుక ముగిశాక అతను తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లాడు. అక్కడ ఫుల్లుగా మందు కొట్టడమే కాక.. ఎలక్ట్రిక్ సిగార్‌ తో ధూమపానం కూడా చేసినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఐతే పార్టీ ముగిశాక డికాప్రియో బయటికి వస్తూ.. తన ఆస్కార్ అవార్డు ప్రతిమను అక్కడే మరిచిపోయి వచ్చాడట. ఐతే రెస్టారెంటు నుంచి నిదానంగా నడుచుకుంటూ వచ్చి తన కారు ఎక్కిన తర్వాత రెస్టారెంట్ సిబ్బంది ఒకరు ఆస్కార్ ప్రతిమను ఆయనకు అందించారట. తనకు ఏదైతే దక్కిందని లియనార్డో పార్టీ చేసుకున్నాడో.. చివరికి దాన్నే మరిచిపోయాడు చూశారా?