Begin typing your search above and press return to search.
ధనుష్ 'సార్' కి వెళ్తే సూపర్ స్టార్ విజువల్ ట్రీట్
By: Tupaki Desk | 16 Feb 2023 11:30 PM ISTతమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన వాతి/సార్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళనాట భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
తమిళనాట ఈ సినిమా యొక్క థియేట్రికల్ రైట్స్ ను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న 'లియో' సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియో సినిమా యొక్క టైటిల్ టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. విజయ్ యొక్క లుక్ మరియు సినిమా మేకింగ్ కు సంబంధించి ఆసక్తి రేకెత్తించే విధంగా టీజర్ ఉంది. ఆ టీజర్ ను థియేటర్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు.
వాతి యొక్క స్క్రీనింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిన సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు లియో యొక్క టైటిల్ టీజర్ ను కూడా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లబోతున్నారు. వాతి/సార్ సినిమా స్క్రీనింగ్ అవ్వబోతున్న దాదాపు అయిదు వేల స్క్రీన్స్ లో సూపర్ స్టార్ విజయ్ యొక్క లియో టైటిల్ టీజర్ స్క్రీనింగ్ అవ్వబోతుంది.
ధనుష్ సినిమా ను చూడ్డానికి వెళ్లిన వారికి సూపర్ స్టార్ విజయ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. లియో పై తమిళంతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఉన్నారు. తప్పకుండా లియో సినిమా విజయ్ మరియు లోకేష్ కనగరాజ్ యొక్క గత చిత్రం మాదిరిగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.