Begin typing your search above and press return to search.

పిక్ టాక్: బ్యాచిలర్ తో రొమాంటిక్ మూడ్ లో బుట్టబొమ్మ..!

By:  Tupaki Desk   |   11 Sep 2021 2:33 PM GMT
పిక్ టాక్: బ్యాచిలర్ తో రొమాంటిక్ మూడ్ లో బుట్టబొమ్మ..!
X
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 8న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్, ఎగ్జైటింగ్ అప్డేట్స్ తో రాబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ స్వరపరిచిన 'మనసా మనసా' 'గుచ్చే గులాబీ' 'ఏ జిందగీ' పాటలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ అందుకున్నాయి. ఈ క్రమంలో ''లెహరాయి'' అనే మరో పాటను చిత్ర బృందం రెడీ చేస్తోంది. సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ అండ్ బ్రీజీ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా అఖిల్ - పూజా లకు సంబంధించిన ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని వదిలారు.

''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోంది. నిర్మాతలు బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆమని - ఈషా రెబ్బా - చిన్మయి - వెన్నెల కిషోర్ - మురళీశర్మ - జయప్రకాష్ - ప్రగతి - అమిత్ తివారి - సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను - అభయ్ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలో నటిస్తున్నారు. ప్రదీశ్ వర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సినిమా విజయంపై హీరో అఖిల్ - డైరెక్టర్ భాస్కర్ ఇద్దరూ ఆశలు పెట్టుకొని ఉన్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.