Begin typing your search above and press return to search.

లెజెండరీ బయోపిక్.. విడుదలకు రంగం సిద్ధమైందా..??

By:  Tupaki Desk   |   25 May 2021 9:00 AM IST
లెజెండరీ బయోపిక్.. విడుదలకు రంగం సిద్ధమైందా..??
X
ఇండియన్ సినీరంగంలో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ జోరుగా నడుస్తుంది. ఏ బాషా ఇండస్ట్రీ చూసినా ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను తెరమీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది సినీస్టార్, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ లతో పాటు క్రికెటర్స్ లైఫ్ స్టోరీస్ కూడా బయోపిక్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ తో పాటు తాజాగా ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్స్ ట్రెండ్ అనేది ప్రస్తుత సినిమారంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది అనే చెప్పాలి. ఇన్నేళ్లు జనాలకు తెలిసి, తెలియకుండా మరుగునపడిన ఫేమస్ స్టార్స్ జీవితాలను సినిమాల రూపంలో మన కళ్లముందు ప్రదర్శిస్తున్నారు.

1983లో ఇండియాకి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన సారధి కపిల్ దేవ్.. లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ '83'. ఈ మూవీకిభజరంగి భాయిజాన్ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. అయితే ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితులు లేకపోవడంతో సినిమా సంధిగ్ధంలో పడింది. నిజానికి దేశంలో కరోనా పరిస్థితి దారుణంగా మారడంతో సినిమా థియేటర్స్ - సినిమా రిలీజెస్ అన్నికూడా వాయిదా పడుతున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇండియాలో కరోనా తగ్గుముఖం పడుతుందనే వార్తలు వస్తున్నాయి.

అయితే మొన్నటివరకు 83 మూవీ విడుదలకి జూన్ మంచి టైం మంచిదని అనుకున్నారట. భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ గెలిచిన రోజు జూన్ 25న.. కాబట్టి అదే రోజున 83 విడుదల కావచ్చని నివేదికలు తెలిపాయి. ఈ సినిమాలో దీపిక పదుకొనే కపిల్ దేవ్ భార్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే కపిల్ దేవ్ బయోపిక్ ను కేవలం హిందీ భాషలో మాత్రమే కాకుండా దక్షిణాది భాషలలో కూడా ప్లాన్ చేసి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు 83 మూవీని జులై చివరి వారంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కరోనా పరిస్థితి చూస్తే అదికూడా సందేహమే అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి రిలీజ్ అనుకున్న టైంలో సాధ్యం అవుతుందేమో!.ఇండియన్ సినీరంగంలో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ జోరుగా నడుస్తుంది. ఏ బాషా ఇండస్ట్రీ చూసినా ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను తెరమీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది సినీస్టార్, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ లతో పాటు క్రికెటర్స్ లైఫ్ స్టోరీస్ కూడా బయోపిక్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ తో పాటు తాజాగా ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్స్ ట్రెండ్ అనేది ప్రస్తుత సినిమారంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది అనే చెప్పాలి. ఇన్నేళ్లు జనాలకు తెలిసి, తెలియకుండా మరుగునపడిన ఫేమస్ స్టార్స్ జీవితాలను సినిమాల రూపంలో మన కళ్లముందు ప్రదర్శిస్తున్నారు.

1983లో ఇండియాకి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన సారధి కపిల్ దేవ్.. లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ '83'. ఈ మూవీకిభజరంగి భాయిజాన్ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. అయితే ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితులు లేకపోవడంతో సినిమా సంధిగ్ధంలో పడింది. నిజానికి దేశంలో కరోనా పరిస్థితి దారుణంగా మారడంతో సినిమా థియేటర్స్ - సినిమా రిలీజెస్ అన్నికూడా వాయిదా పడుతున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇండియాలో కరోనా తగ్గుముఖం పడుతుందనే వార్తలు వస్తున్నాయి.

అయితే మొన్నటివరకు 83 మూవీ విడుదలకి జూన్ మంచి టైం మంచిదని అనుకున్నారట. భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ గెలిచిన రోజు జూన్ 25న.. కాబట్టి అదే రోజున 83 విడుదల కావచ్చని నివేదికలు తెలిపాయి. ఈ సినిమాలో దీపిక పదుకొనే కపిల్ దేవ్ భార్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే కపిల్ దేవ్ బయోపిక్ ను కేవలం హిందీ భాషలో మాత్రమే కాకుండా దక్షిణాది భాషలలో కూడా ప్లాన్ చేసి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు 83 మూవీని జులై చివరి వారంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కరోనా పరిస్థితి చూస్తే అదికూడా సందేహమే అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి రిలీజ్ అనుకున్న టైంలో సాధ్యం అవుతుందేమో!.