Begin typing your search above and press return to search.

రాజమౌళికి ఏజెంట్ ని రికమండ్ చేసిన లెజెండ్

By:  Tupaki Desk   |   29 Jun 2019 11:17 AM
రాజమౌళికి ఏజెంట్ ని రికమండ్ చేసిన లెజెండ్
X
గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు సెలెబ్రిటీల మద్దతు పెరుగుతోంది. తాజాగా దర్శక దిగ్గజం లెజెండ్ అఫ్ డైరెక్టర్స్ గా సినిమా ప్రేమికులు పిలుచుకునే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు ఇవాళ ఈ స్పై థ్రిల్లర్ ని స్పెషల్ షో ద్వారా చూశారు. అంతే కాదు ప్రత్యేకంగా అభినందిస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు.

నవీన్ పోలిశెట్టి చాలా బాగా చేశాడని ఇన్ని వేరియేషన్స్ మొదటి సినిమాలో చూపడాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. హీరోయిన్ ఉన్నా ఒక్క డ్యూయెట్ లేకుండా అంత పక్కాగా స్క్రిప్ట్ రాసుకోవడం పట్ల ఇంప్రెస్ అయ్యానని చెబుతున్న రాఘవేంద్ర రావు స్పెషల్ గా రాజమౌళిని ఈ సినిమా చూడమని రికమండ్ చేయడం విశేషం

సాధారణంగా ఇలాంటి సినిమాలు ఏవి వచ్చినా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలూ షేర్ చేసుకునే రాజమౌళి ఆర్ఆర్ఆర్ వల్ల అందుబాటులో లేరు. ఇప్పుడు తన గురువే స్వయంగా చెప్పడంతో ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది. మొదటి రోజు నుంచే సినీ ప్రముఖుల నుంచి దక్కుతున్న మద్దతు ఏజెంట్ ఆత్రేయకు బాగా హెల్ప్ అవుతోంది. ఇప్పటికే ఎనిమిది కోట్ల దాకా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ టాక్. ఇప్పటికీ స్టడీ రన్ కొనసాగిస్తున్న ఆత్రేయకు అపోజిషన్ ఎంత ఉన్నా మౌత్ పబ్లిసిటీ వల్ల వసూళ్లు రాబడుతోంది. ఇప్పుడు రాజమౌళి చూసాక ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి