Begin typing your search above and press return to search.

సైఫ్ చెల్లెలి సినిమా.. రిలీజ్ కష్టమేనంట

By:  Tupaki Desk   |   6 Oct 2016 5:30 PM GMT
సైఫ్ చెల్లెలి సినిమా.. రిలీజ్ కష్టమేనంట
X
31 అక్టోబర్.. ఈ డేట్ కి భారత రాజకీయ చరిత్రలోనే బోలెడంత ప్రాధాన్యం ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని.. పదవిలో ఉన్నపుడే ఆమె ఇంటిలోనే.. ఆమె బాడీగార్డులే దారుణంగా హత్య చేసిన రోజు ఇది. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటన బహుశా జరగలేదు. అందుకే ఈ ఉదంతాన్ని అనేక యాంగిల్స్ లో సినిమాగా తీసేందుకు మేకర్స్ ఉత్సాహం చూపిస్తుంటారు.

సైఫ్ ఆలీ ఖాన్ చెల్లెలు సోహా ఆలీ ఖాన్ ప్రధాన పాత్రో 31st October.. పేరుతో సినిమా సిద్ధమైంది. 31 అక్టోబర్ 1984 నాడు ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు కాల్చి చంపిన తర్వాత.. ఢిల్లీలోనే ఉంటున్న ఓ సిక్కు కుటుంబం ఎదుర్కున్న సమస్యల యాంగిల్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. అక్టోబర్ 7న విడుదల కావాల్సిన ఈ మూవీ రిలీజ్.. ఇప్పుడు సందిగ్ధంలో పడింది. దేశ సెక్యులర్ విధానాలను తప్పుగా చూపించడమే కాకుండా.. ఒక రాజకీయ పార్టీపై ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. ఈ సినిమాకి వ్యతిరేకంగా పిల్ దాఖలు కావడంతో.. విడుదల సందిగ్ధంలో పడిపోయింది.

ట్రైలర్ లో కొద్దిగానే చూపించానా.. ఇతరుల మనోభావాలు దెబ్బతీసే స్థాయిలో పాత్రలను డిజైన్ చేశారని పిటిషన్ లో వివరించారు. ఇందిర హత్యపై తీసిన సినిమా రిలీజ్ ఆగిపోవడం ఇదేమీ మొదలు కాదు. గతంలో కౌమ్ హీ డీరే పేరుతో.. ప్రధానిని హత్య చేసిన ఇద్దరు బాడీ గార్డుల యాంగిల్ లోనూ సినిమా తీసినా.. మన ప్రభుత్వం ఆ మూవీని బ్యాన్ చేసింది. ఇప్పుడు సోహా ఆలీ ఖాన్ సినిమా పరిస్థితి కూడా ఇంతే కావచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/