Begin typing your search above and press return to search.

పాత లవర్ కి పంచ్ వేసి ఇరుక్కున్నాడు

By:  Tupaki Desk   |   30 March 2016 10:39 AM GMT
పాత లవర్ కి పంచ్ వేసి ఇరుక్కున్నాడు
X
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు పెద్ద వివాదంలోనే ఇరుక్కున్నాడు. తన మాజీ లవర్ కంగనా రనౌత్ విషయంలో మీడియా చేస్తున్న హడావిడి చూసిన హృతిక్.. స్ట్రాంగ్ రియాక్షన్ ఇద్దామని ఫీలయ్యాడు. అందుకు తగ్గట్లుగానే వెటంకారంగా ఓ ట్వీట్ కూడా పెట్టాడు. కానీ ఇందులోకి పోప్ ను కూడా లాగడంతో.. చివరకు లీగల్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ తో హృతిక్ నడిపిన ప్రేమాయణం అందరికీ తెలిసిందే. దీనిపై ఈ మధ్య మీడియాలో బోలెడు కథనాలు వస్తున్నాయి. అంతే కాకుండా.. కంగనా, హృతిక్ లు లీగల్ నోటీసులు, పబ్లిక్ స్టేట్మెంట్లు ఆల్రెడీ రచ్చకెక్కేశారు.

ఇలాంటి సమయంలో హృతిక్ చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. 'మీడియా జనాలు చెబుతున్న అందమైన అమ్మాయిలతో కంటే.. నాకు పోప్ తోనే రిలేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి' అంటూ హృతిక్ రోషన్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. ఓ స్టార్ అయి ఉండి.. క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీశాడనే ఆరపోణతో కేసులు నమోదువతున్నాయి.

ఈ మేరకు క్రైస్తవ మతస్తులకు, పోప్ కు క్షమాపణ చెప్పాలంటూ క్రిస్టియన్ సెక్యులర్ ఫోరం ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తమ మతస్తుల మనోభావాలను దెబ్బ తీశారంటూ.. ఐపీసీ సెక్షన్ 295ఏ కింద నోటీసులు అందుకున్నాడు హ-తిక్. మొత్తానికి కంగనాకు, మీడియాకు పంచ్ వేయబోయి.. చివరకు తనే ఇరుక్కుపోయాడు హృతిక్ రోషన్.