Begin typing your search above and press return to search.

ఇక్కడే కాదు బాలీవుడ్‌ లోనూ 'ఆ కష్టం' తప్పడం లేదట!

By:  Tupaki Desk   |   29 July 2022 4:30 PM GMT
ఇక్కడే కాదు బాలీవుడ్‌ లోనూ ఆ కష్టం తప్పడం లేదట!
X
స్మార్ట్‌ ఫోన్స్ వచ్చిన తర్వాత సినిమా ల షూటింగ్ లొకేషన్స్‌ ల్లో ఎవరు ఎక్కడ నుండి ఫోటోలు వీడియో లు తీసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారో అర్థం కావడం లేదు. అందుకే గతంలో మాదిరిగా ఈ మధ్య కాలంలో ఔట్ డోర్ షూటింగ్స్ ను చేయలేక పోతున్నారు. ఎక్కువ శాతం స్టూడియోల్లో మరియు ఇండోర్ లో మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది.

టాలీవుడ్ ను ఈమధ్య కాలంలో ఎక్కువగా వేదిస్తున్న సమస్య లీక్‌. కొందరు సినిమా ను ప్రమోట్ చేయడం కోసం పిక్స్‌ లేదా వీడియో లను లీక్ చేస్తూ ఉంటే ఎక్కువ శాతం సినిమా ల నుండి యూనిట్‌ సభ్యులతో సంబంధం లేకుండా లీక్స్ అవుతూ ఉన్నాయి. ఇటీవల ఆర్‌సీ 15 సినిమా యొక్క ఒక ఫోటో లీక్ అవ్వడం వల్ల సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చేసింది.

ఈ లీక్ అనేది కేవలం టాలీవుడ్‌ నే కాకుండా బాలీవుడ్ ను కూడా వేదిస్తోంది. ఆ మధ్య ఒక స్టార్‌ హీరో సినిమా షూటింగ్ స్పాట్‌ నుండి ఫోటో లీక్‌ అవ్వడంతో దాన్ని డిలీట్ చేయించడం కోసం యూనిట్‌ సభ్యులు చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా మరో బాలీవుడ్‌ స్టార్ హీరో సినిమా ఆన్ లొకేషన్‌ స్టిల్‌ లీక్ అయ్యింది.

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తాప్సి హీరోయిన్ గా రూపొందుతున్న డుంకీ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆ షూటింగ్‌ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది.

ఫోటో క్లీయర్ లేకున్నా కూడా జాతీయ స్థాయిలో షారుఖ్ అభిమానులు మరియు సోషల్‌ మీడియా జనాలు మీడియా వర్గాల వారు తెగ షేర్‌ చేస్తున్నారు.

డుంకీ సినిమా లో షారుఖ్‌ ఖాన్‌ ఎలా ఉండబోతున్నాడు.. అసలు సినిమా ఏంటీ అనే విషయం లో ఇన్నాళ్లు సస్పెన్స్ తో సినిమా కోసం ఎదురు చూసిన జనాలు ఇప్పుడు షారుఖ్‌ లుక్ చూశారు. దాంతో సినిమాపై ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ లీక్ అనేది సినిమాలకు అతి పెద్ద కష్టంగా మారింది.