Begin typing your search above and press return to search.

'ఎవరు మీలో కోటీశ్వరులు' నుంచి లీకైన ఎన్టీఆర్ లుక్ వైరల్..!

By:  Tupaki Desk   |   10 March 2021 10:35 AM GMT
ఎవరు మీలో కోటీశ్వరులు నుంచి లీకైన ఎన్టీఆర్ లుక్ వైరల్..!
X
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ ని హోస్ట్ చేసిన తారక్.. నటుడిగానే కాకుండా టీవీ హోస్టుగా కూడా నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే గేమ్ షో ద్వారా మరోసారి స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ని అలరించడానికి వస్తున్నాడు.

హిందీలో సక్సెస్ ఫుల్ అయిన 'కౌన్ బనేగా కరోడ్‌ పతి' అనే షోను తెలుగులో స్టార్ మా ఛానల్ వారు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జెమిని టీవీ వారు అదే కాన్సెప్ట్ ని తీసుకొని 'ఎవరు మీలో కోటీశ్వరులు' పేరుతో షోను ప్లాన్ చేశారు. 'ప్రపంచ వ్యాప్తంగా120 దేశాల్లో సక్సెస్ అయిన షో.. మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో' అంటూ జెమిని వారు ఇప్పటికే ప్రోమోని కూడా వదిలారు. అయితే అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ షో కి జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా "ఎవరు మీలో కోటీశ్వరులు" ఎన్టీఆర్ ప్రోమోకి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ బ్లాక్ బ్లేజర్ ధరించి న్యూ హెయిర్ స్టైల్ తో ఉబర్ స్టైలిష్ గా ఉన్నాడు. ట్రిమ్ చేసిన గడ్డం, మీసాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. హోస్టుగా మరోసారి తారక్ అదరగొడతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేపు శివరాత్రి సందర్భంగా లేదా మార్చి 13న ఎన్టీఆర్ హోస్ట్ అనే విషయాన్ని జెమినీ వారు ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో షూట్ చేసారని టాక్ నడుస్తోంది.