Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత భార్య అరెస్ట్‌..!

By:  Tupaki Desk   |   9 Nov 2020 4:20 PM IST
డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత భార్య అరెస్ట్‌..!
X
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ జరువుతున్న సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుని విచారిస్తున్న క్రమంలో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటకు రావడంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురుని ఈ కేసులో అరెస్ట్ చేసి.. మరికొందరిని విచారిసింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఫిరోజ్ నాడియాద్వాలా భార్య షబానా సయీద్‌ ని ఎన్సీబీ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అధికారికంగా వెల్లడించారు. షబానా సయీద్‌ ను నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద అరెస్టు చేశామని తెలిపారు.

కాగా, షబానా సయీద్‌ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం అందడంతో ఎన్సీబీ అధికారులు సబర్బన్‌ జూహూలోని షబానా నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడ సుమారు 10 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను విచారణకు పిలిచిన ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఫిరోజ్‌ నాడియాద్వాలా ను కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ కబడి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అలానే ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ మరియు అర్జున్ రామ్ పాల్ గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడుని కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసారు. నెల క్రితం డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కున్న దీపికా పదుకునే మాజీ మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఇంట్లో డ్రగ్స్ దొరకడంతో మరోసారి సమన్లు జారీ చేశారు.