Begin typing your search above and press return to search.

వరుస సినిమాలు చేస్తూ వెస్ సిరీస్‌ తో రాబోతున్న ప్రముఖ దర్శకుడు

By:  Tupaki Desk   |   21 March 2022 2:30 AM GMT
వరుస సినిమాలు చేస్తూ వెస్ సిరీస్‌ తో రాబోతున్న ప్రముఖ దర్శకుడు
X
ప్రస్తుతం హాలీవుడ్‌.. బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్ దర్శకులు మరియు నటీ నటులు స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు చేస్తూ ఓటీటీ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఓటీటీ కంటెంట్ కు భారీగా ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా భారీగా ఈ వెబ్‌ సిరీస్ లకు మరియు వెబ్‌ కంటెంట్ కు ఆధరణ ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనే బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న శతమానంభవతి చిత్ర డైరెక్టర్ వేగేశ్న సతీష్ కూడా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో 'కోతి కొమ్మచ్చి', 'శ్రీ శ్రీ రాజా వారు' సినిమాలు వరుగా రాబోతున్నారు. రెండు సినిమా లు చేస్తున్న వేగేశ్న సతీష్ ఒక పల్లెటూరి కథతో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.

ఇది పూర్తిగా ఆయన మార్క్ పల్లెటూరి కథతో తెరకెక్కనున్న ఆంతాలజీతో కూడిన వెబ్ సిరీస్ అంటూ సమాచారం అందుతోంది. అందుకే దీనికి 'కథలు (మీవి మావి)' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే మూడు కథలకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.

త్వరలోనే మిగిలిన కథలు షూట్ చేసి ఒక ప్రముఖ ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు తీసి దర్శకుడు వేగేశ్న సతీష్ ఈ వెబ్ సిరీస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా.. ప్రతి ఒక్కరు చూసేలా ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారంటూ సమాచారం అందుతోంది.

ఈ వెబ్‌ సిరీస్ లో ప్రముఖ నటీ నటులు మరియు కొత్త వారు నటిస్తున్నారు. కొత్త మరియు పాత వారి కలయికలో ఈ కథలు వెబ్‌ సిరీస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అలాగే ప్రముఖ సాంకేతిక నిపుణులు కూడా ఈ వెబ్‌ సిరీస్ కు పని చేస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

ఎన్టీఆర్‌ బావమర్ది నార్నె నితిన్‌ తో ఈయన చేయబోతున్న సినిమా శ్రీ శ్రీ రాజా వారు పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకే సారి రెండు సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ చేసిన.. చేస్తున్న ఘనత ఈయనకే దక్కుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.