Begin typing your search above and press return to search.

వీడియో : లయ ను ఇలా చూడటం ఆశ్చర్యంగా ఉంది

By:  Tupaki Desk   |   22 Feb 2022 3:30 AM GMT
వీడియో : లయ ను ఇలా చూడటం ఆశ్చర్యంగా ఉంది
X
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె చేసిన సినిమాలు ఇప్పటికి కూడా ఆమె ను జనాలు గుర్తు పెట్టుకునేలా చేశాయి. హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులకు దూరంగా ఉన్నా కూడా ఆమెను ఇంకా జనాలు అభిమానిస్తూనే ఉన్నారు. తాజాగా లయ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆమె చేస్తున్న ప్రతి పోస్ట్‌ ను కూడా చర్చనీయాంశం అవుతుంది.

ప్రస్తుతం సోషల్‌ మీడియాను కుదిపేస్తున్న కచ్చా బాదాం పాటకు లయ డాన్స్‌ చేసింది. ఆ పాటకు ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ మరియు సోషల్‌ మీడియా సెలబ్రెటీలు డాన్స్ చేసి అలరించారు.

ఇప్పుడు లయ కూడా ఆ పాటకు డాన్స్ చేసింది. చీర కట్టులో సింపుల్‌ స్టెప్పులతో ఆ పాట కు అనుగుణంగా డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ లయను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

లయ ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఆమె రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ మద్య లయ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు జోరుగా వచ్చాయి.

కాని ఆమె ఇమేజ్ కు తగ్గ ఆఫర్లు రాకపోవడంతో వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. లయ నటిగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని కొందరు కోరుకుంటున్నారు.

ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ లయ మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటూ మరింతగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా హీరోయిన్ గా కూడా నటించేంత అందంగా లయ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ చాలా మంది రీ ఎంట్రీ ఇచ్చారు. కనుక లయ కూడా ఇప్పుడు కాకున్నా మరికొన్ని రోజుల తర్వాత అయినా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

బుల్లి తెర తో పాటు వెండి తెరపై కూడా తనదైన ముద్రను వేసిన లయ 1992 లో బద్రం కొడుకో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 1999 సంవత్సరంలో వచ్చిన స్వయంవరం సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది.

హీరోయిన్ గా ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. నటిగా తన సత్తా చాటుతూ అభిమానులను సొంతం చేసుకుంది. నటిగా మంచి ఫామ్‌ లో ఉన్న సమయంలోనే సినిమాలకు దూరం అయ్యింది. మళ్లీ ఆమె రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.