Begin typing your search above and press return to search.
'కాంచన' రీమేక్ ''లక్ష్మి'' ప్రేక్షకులను మెప్పించిందా..?
By: Tupaki Desk | 10 Nov 2020 12:00 PM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ మాస్టర్ గా, నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ''లక్ష్మి'' సినిమాతో డైరెక్టర్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ - కైరా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో 'ముని' సిరీస్ లో భాగంగా తెలుగు తమిళ భాషల్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ''కాంచన'' కు రీమేక్ గా రూపొందింది. దీపావళి కానుకగా 'లక్ష్మి' చిత్రాన్ని నిన్న(నవంబర్ 9) డిస్నీ+హాట్ స్టార్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేసారు. సౌత్ లో హిట్ గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించిందో చూద్దాం.
కథ విషయానికొస్తే ముస్లిం మతానికి చెందిన ఆసిఫ్(అక్షయ్ కుమార్) హిందూ అమ్మాయి రష్మి(కియరా అద్వాని)ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంతో తల్లిదండ్రులు వారిని దూరం పెడతారు. అయితే మూడేళ్ళ తర్వాత రష్మి తల్లిదండ్రుల 25 ఏళ్ళ పెళ్లిరోజు వేడుక కోసం ఇంటికి వస్తారు. దెయ్యాలు, భూతాలంటే నమ్మకం లేని ఆసిఫ్ అందరూ దెయ్యాలున్నాయని భయపడే ఓ ప్రదేశంలో క్రికెట్ ఆడతాడు. అయితే ఆసిఫ్ ఒంట్లోకి లక్ష్మి ఆత్మ ప్రవేశించిన తర్వాత అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలా ఎందుకు జరిగుతోంది? అసలు 'లక్ష్మి' ఎవరు? లక్ష్మి ఎందుకు ఆసిఫ్ ని ఎందుకు ఆశ్రయించింది? అనేదే మిగతా స్టోరీ.
'లక్ష్మి' సినిమాలో అక్షయ్ కుమార్ ట్రాన్స్ జెండర్ గా దెయ్యాలు అంటే భయపడని వ్యక్తిగా తనదైన శైలిలో మెప్పించాడు. స్త్రీలా ప్రవర్తించిన విధానం.. ఆత్మ పాత్రలో అక్షయ్ హావభావాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక ట్రాన్స్ జెండర్ 'లక్ష్మి' పాత్రలో నటించిన శరద్ కేల్కర్('సర్ధార్ గబ్బర్ సింగ్' విలన్) సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడు. శరద్ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ అద్భుతంగా నటించాడని చెప్పవచ్చు. కియారా గ్లామరస్ గా కనిపించినా ఆమె పాత్ర పెద్దగా ప్రభావం చూపించలేదు. భూతాలు దెయ్యాలకు భయపడే ఓ యువకుడికి అనుకోకుండా దెయ్యం పట్టుకుంటే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ కి సందేశాన్ని జతచేసి రూపొందించిన 'కాంచన' చిత్రం స్థాయిలో 'లక్ష్మి' మెప్పించలేదనే టాక్ వస్తోంది.
రాఘవ లారెన్స్ మాతృకను అదే విధంగా తీయకుండా కథలో తగినన్ని మార్పులు చేశాడు. కాకపోతే ఇది పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ముఖ్యంగా సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కామెడీ ఒకటీ అర సీన్స్ లో తప్ప బీ టౌన్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. అందులోనూ ఆల్రెడీ 'కాంచన' సినిమా చూసిన వారికి ఈ సినిమాఅసలు నచ్చకపోవచ్చు. అయితే నేపథ్య సంగీతం.. విజువల్స్ బాగున్నాయి. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ - ఫాక్స్ స్టార్ స్టూడియోస్ - షబీనా ఎంటర్‌టైన్‌మెంట్ - తుషార్ ఎంటర్‌టైన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఏదేమైనా 'కాంచన' లో వర్కౌట్ అయిన కామెడీ మరియు ఎమోషన్స్ సరిగా ఎలివేట్కాలేదనే చెప్పాలి. మరి 'లక్ష్మి' సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ సౌండింగ్ కి విజువల్స్ డిఫరెంట్ గా కనిపించి ఉండేదేమో!