Begin typing your search above and press return to search.

ఓటీటీ స్టామినా ఏంటో చూపించే సినిమా రాబోతోందా...?

By:  Tupaki Desk   |   17 Sep 2020 3:30 PM GMT
ఓటీటీ స్టామినా ఏంటో చూపించే సినిమా రాబోతోందా...?
X
కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సినిమా థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్ గత ఆరున్నర నెలల నుంచి మూతబడి ఉన్నాయి. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులిచ్చినప్పటికీ థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సినిమాలన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు లేట్ అయినా థియేటర్లలోనే మా సినిమా విడుదల చేస్తాం అన్నవారు కూడా ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఆరు నెలల్లో వివిధ భాషల నుంచి అనేక సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. హిందీలో 'గులాబో సితాబో' 'దిల్ బేచారా' 'లూట్ కేస్' 'యారా' 'సడక్ 2' 'గుంజన్ సక్సేనా : కార్గిల్ గర్ల్' 'శకుంతలాదేవి' వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. మళయాలంలో 'సూపియుమ్ సుజాతయుమ్' 'సీ యూ సూన్'.. కన్నడలో 'లా' మరియు 'ఫ్రెంచ్ బిర్యానీ' సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక తెలుగులో దాదాపు అన్నీ చిన్న సినిమాలే విడుదలకాగా ఈ మధ్యే ''వి'' సినిమా రిలీజ్ అయింది. అయితే ఇన్ని సినిమాలు రిలీజైన ఓటీటీ స్టామినా ఏంటో తెలియజేసే మూవీ మాత్రం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా, ఇప్పటి వరకు రిలీజైన చిత్రాల్లో 'దిల్ బేచారా' కి మాత్రమే ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. కాకపోతే ఇది క్లాస్ సినిమా. దీంతో మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేసే సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని.. మంచి మాస్ మసాలా సినిమా పడితే కానీ ఓటీటీ ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆడియన్స్ అనుకున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఎన్నో అంచనాలతో విడుదలైన నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం 'వి' కి మిశ్రమ స్పందన వచ్చింది. సూర్య నటించిన ''ఆకాశం నీ హద్దురా!'' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పటికీ ఇది కూడా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే సినిమాలాగే అనిపిస్తుంది. ఈ క్రమంలో ఓటీటీలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ అంటే ''లక్ష్మీ బాంబ్'' అనే చెప్పాలి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన 'లక్ష్మీబాంబ్' చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన హార్రర్ కామెడీ 'కాంచన' కు రీమేక్ తెరకెక్కింది. ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన సినిమాల్లో భారీ బడ్జెట్ మూవీ 'లక్ష్మీబాంబ్' అని చెప్పవచ్చు. మరి దీపావళికి పేలనున్న ''లక్ష్మీ బాంబ్'' ఓటీటీ స్టామినా ఏంటో చూపిస్తుందేమో చూడాలి.