Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ గుండెలు గాయ‌ప‌రిచి.. పెళ్లి చేసుకోబోతున్న బ్యూటీ!

By:  Tupaki Desk   |   7 April 2021 1:30 PM GMT
ఫ్యాన్స్ గుండెలు గాయ‌ప‌రిచి.. పెళ్లి చేసుకోబోతున్న బ్యూటీ!
X
ల‌క్ష్మీ రాయ్ గా వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన శాండ‌ల్ వుడ్ బ్యూటీ.. దాదాపు 16 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతోంది. తెలుగులో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘కాంచ‌నమాల కేబుల్ టీవీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించిందీ అమ్మడు. ఆ విధంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ల‌క్ష్మీరాయ్‌.. సౌత్ లో త‌న హ‌వా కొన‌సాగించింది.

ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ల‌క్ష్మీరాయ్‌.. టాప్ రేంజ్ కు మాత్రం చేరుకోలేక‌పోయింది. దీంతో.. న్యూమ‌రాల‌జీపై న‌మ్మ‌కంతో త‌న పేరును మార్చుకుంది. కెరీర్ తోపాటు ప‌లు విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రాయ్ ల‌క్ష్మీ అంటూ పేరు తిర‌గేసింది. అయితే.. కెరీర్ మాత్రం పెద్ద‌గా తిర‌గ‌బ‌డ‌లేదు.

ఆ త‌ర్వాత‌ మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఖైదీ నెంబ‌ర్ 150లో, ప‌వ‌న్ కల్యాణ్ తో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ఐట‌మ్ సాంగ్స్ లో న‌ర్తించింది. మొత్తానికి ఏదోవిధంగా కెరీర్ కొన‌సాగిస్తూ వ‌చ్చింది రాయ్ ల‌క్ష్మీ. అయితే.. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతోందంటూ కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ.. అధికారికంగా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ వీటిపై స్పందించ‌లేదీ బ్యూటీ.

అయితే.. తాజాగా త‌న పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చింది. తాను పెళ్లిచేసుకోబోతున్న విష‌యం వాస్త‌వ‌మేన‌ని ధృవీక‌రించింది. ఈ నెల 27న నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేసుకున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇన్నాళ్లూ రీల్ లైఫ్‌ లో త‌న అంద‌చందాల‌తో అభిమానుల‌ను అల‌రించిన రాయ్ ల‌క్ష్మి.. ఇక‌, గృహిణిగా నిజ‌జీవిత పాత్ర‌ను పోషించ‌బోతోంది.