Begin typing your search above and press return to search.

వారెవ్వా ఏమి సొగ‌సు.. అచ్చం ర‌త్తాలులాగ ఉంది!

By:  Tupaki Desk   |   26 April 2021 4:00 PM IST
వారెవ్వా ఏమి సొగ‌సు.. అచ్చం ర‌త్తాలులాగ ఉంది!
X
అస‌లే కోవిడ్ హ‌డ‌లెత్తిస్తుంటే ర‌త్తాలు ఏంటిలా విమానాశ్ర‌యాల్ని చుట్టేస్తోంది. ముంబై టు హైద‌రాబాద్ .. హైద‌రాబాద్ టు చెన్న‌య్.. చెన్న‌య్ టు బాంబే.. అంటూ తెగ షికార్లు చేస్తోంది? ఏమో దానికి రీజ‌న్ తెలీదు కానీ.. ర‌త్తాలు అలియాస్ రాయ్ ల‌క్ష్మీ అలా అడుగు పెట్ట‌గానే విమానాశ్ర‌యం బ్లాక్ అయిపోతుంద‌నుకుంటే అందుకు రివ‌ర్సులో జ‌నం ఎవ‌రి టెన్ష‌న్ లో వాళ్లు ప‌రుగులు పెడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

తాజాగా శంషాబాద్ విమానాశ్ర‌యంలో ర‌త్తాలు ప్ర‌త్య‌క్షమైందిలా. క్రీగంటి చూపుల‌తో కుర్ర‌కారు గుండెల్లో ముల్లు గుచ్చేసింది. అంతేకాదు ర‌త్తాలు ఎయిర్ పోర్ట్ లుక్ చినిని చినికి చాటైన‌ట్టుగా.. చిలుకాకు ప‌చ్చ స్వెట్ ష‌ర్ట్ కి కాంబినేష‌న్ గా పింక్ కాట‌న్ జీన్స్ కాంబినేష‌న్ తో అద‌ర‌హో అనిపించింది. ఇక పింక్ జీన్స్ కి ఆపోజిట్ లో పాకెట్ మాత్రం చిలుకాకు ప‌చ్చ‌.. దానికి తోడు ఆ క‌ళ్ల‌కు ఆకుప‌చ్చ క‌ళ్ల‌ద్దాలే.

అస‌లు ఈ కాంబినేష‌న్ ఐడియానే మైండ్ బ్లాకింగ్. ఆ బాట‌మ్ పింక్ క‌ల‌ర్ కి త‌గ్గ‌ట్టే పింక్ మాస్క్ ని ధ‌రించిన రాయ్ ల‌క్ష్మీ బాట‌మ్ లో కాఫీ- పింక్ మిక్స్ చేసిన స్పోర్ట్స్ షూస్ ధ‌రించి వారెవ్వా అనిపించింది. వారెవ్వా ఏమి సొగ‌సు.. అచ్చం ర‌త్తాలులాగ ఉంది..! అంటూ యూత్ ఒక‌టే ఫిదా అయిపోతున్నారు. ఆ క్ష‌ణం విమానాశ్ర‌యంలో ఎర్త్ షేకైందంటే న‌మ్మండి!!